మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్న సంగతి తెలిసిందే.అయితే ఆచార్య ఫలితం చిరంజీవికి షాకిచ్చింది.
ఆచార్య రిజల్ట్ వల్ల చిరంజీవి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి.చిరంజీవి నటించిన మూడు సినిమాలు థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయనే సంగతి తెలిసిందే.
గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు వరుసగా థియేటర్లలో విడుదల కానుండగా సినిమాల విషయంలో మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది.కొన్నిరోజుల క్రితం మెగాస్టార్ మారుతి కాంబినేషన్ లో ఒక సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడింది.
అయితే ఈ ప్రాజెక్ట్ ఉండకపోవచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.మారుతి మరీ అద్భుతమైన కథతో చిరంజీవిని కలిస్తే మాత్రమే ఈ ప్రాజెక్ట్ ఉండే అవకాశం అయితే ఉంది.
చిరంజీవి యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయాల్సి ఉండగా చిరంజీవికి బదులుగా చరణ్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో నటించనున్నారు.ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న మూడు సినిమాలు 2023 సంవత్సరం సమ్మర్ నాటికి థియేటర్లలో విడుదల కానున్నాయి.
ఈ సినిమాల ఫలితాలను బట్టి చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోనున్నారు.
సూట్ అయ్యే కథలు దొరకని పక్షంలో రీమేక్ లలో నటించాలని చిరంజీవి భావిస్తున్నారని బోగట్టా.చిరంజీవి కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని ఆయన భావిస్తున్నారు.
చిరంజీవి ఒక్కో సినిమాకు 35 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోనున్నారని సమాచారం అందుతోంది.మెగాస్టార్ చిరంజీవి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.