చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ఎన్నెన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు.ఖరీదైన క్రీమ్స్, మాయిశ్చరైజర్స్, సీరమ్స్ కొనుగోలు చేసి వాడుతుంటారు.
తరచూ ఫేస్ ప్యాకులు, మాస్క్‌లు వేసుకుంటారు.నెలకు ఒకసారి బ్యూటీ పార్లర్‌కి వెళ్లి ఫేషియల్స్ చేయించుకుంటారు.
అయితే ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం ఐస్ వాటర్‌తోనూ అందాన్ని పెంచుకోవచ్చు.వివిధ రకాల చర్మ సమస్యలను కూడా వదిలించుకోవచ్చు.
అదెలాగో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ మరియు చల్లటి వాటర్ వేసుకోవాలి.
ఇప్పుడు ఈ వాటర్‌లో ముఖాన్ని ముంచి పదిహేను సెకెండ్ల పాటు ఉంచాలి.ఇలా రెండు, మూడు సార్లు చేశాక.ముఖాన్ని మెత్తటి టవల్‌తో శుభ్రంగా తుడుచుకోవాలి.ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఇలా చేయడం వల్ల ముఖం తాజాగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
అలాగే ఈ ఐస్ వాటర్ మెథడ్ ని రెగ్యులర్‌గా ఫాలో అయితే.ఉబ్బిన కళ్ళ నుండి ఉపశమనం లభిస్తుంది.చికాకు, దురద వంటివి దూరం అవుతాయి.ముఖంపై దద్దుర్లు ఏమైనా వస్తే.
వాటి నుండి రిలీఫ్ పొందొచ్చు.ముఖంలో డల్ నెస్ పరార్ అవుతుంది.
చర్మంపై అదనపు జిడ్డు తొలగిపోతుంది.

అంతేకాదు, మొండి మొటిమలు, వాటి తాలూకు మచ్చలతో సతమతం అయ్యేవారికి ఈ ఐస్ వాటర్ మెథడ్ అద్భుతంగా సహాయపడుతుంది.ప్రతి రోజు పైన చెప్పిన విధంగా ముఖాన్ని ఐస్ వాటర్‌లో కాసేపు నానబెడితే.మొటిమలు, మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి.
ఇక చాలా మంది తమ మేకప్ ఎక్కువసేపు ఉండటం లేదని తెగ బాధపడుతుంటారు.అలాంటి వారు పైన చెప్పిన ఐస్ వాటర్ మెథడ్‌ను పాటించి.
ఆపై మేకప్ వేసుకోవాలి.ఇలా చేస్తే మేకప్ ఎక్కువ సమయం పాటు చెదరకుండా ఉంటుంది.







