ప్రవాసుల అరెస్ట్ లతో కువైట్ కు కొత్త చిక్కు....తలలు పట్టుకుంటున్న అధికారులు...!!!

గడిచిన కొంత కాలంగా ప్రవాసులను ముప్పు తిప్పలు పెడుతున్న కువైట్ దేశం ప్రస్తుతం అదే ప్రవాసుల కారణంగా మూడు చెరువుల నీళ్ళు తాగుతోంది.ఆ రూల్స్, ఈ రూల్స్ అంటూ పనికిమాలిన రూల్స్ పెడుతూ కువైట్ నుంచీ ప్రవాసులను బలవంతంగా వెళ్ళ గోడుతున్న కువైట్ ప్రభుత్వం.2017 లో అమలు లోకి వచ్చిన కువైటైజేషన్ పాలసీని వేగవంతంగా అమలు చేస్తోంది.దాంతో ఎంతో మంది ప్రవాసులు కువైట్ ను వీడి వెళ్ళిపోవాల్సి వస్తోంది.

 A New Problem For Kuwait With The Arrest Of Expatriates , Kuwait , Expatriates,-TeluguStop.com

ఈ క్రమంలోనే రూల్స్ అతిక్రమించారని, వీసా రెన్యువల్ అవలేదని, ఇలా పలు రకాల కారణాలు చెప్తూ నిత్యం వందలాది మంది ప్రవాసులను అరెస్ట్ చేస్తోంది కువైట్ అయితే.

ఇక్కడే కువైట్ కు పెద్ద చిక్కొచ్చి పడింది.

తుమ్మినా దగ్గినా అరెస్ట్ లు చేసుకుంటూ పోతున్న కువైట్ వారందరినీ ఓ సంరక్షణ ప్రాంతంలో ఉంచి వారిలో ఎవరైతే వారి వారి దేశాలకు వెళ్ళిపోగలరో వారిని పంపెస్తోంది.అయితే అత్యధిక శాతం వీసా అయిపోయి రెన్యువల్ కు డబ్బులు లేని వారి జాబితానే ఎక్కువగా ఉండటంతో వారిని తీసుకువచ్చిన స్పాన్సర్ లకు కబురు పంపుతోంది.

కానీ ఈ లోగా సంరక్షణ ప్రాంతంలో ఉన్న వారి బాగోగులు చూసుకోవడం ఇప్పుడు ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారుతోంది.

Telugu Expatriates, Jails, Kuwait, Policy, Sponsors, Visa, Visa Renewal-Telugu N

ప్రవాసులు వారి దేశాలకు వెళ్ళే వరకూ వారికి రోజు వారికి కావాల్సిన ఆహరం, నీళ్ళు, అనారోగ్యం పాలైతే హాస్పటల్ ఖర్చులు వగైరా ప్రభుత్వమే సమకూర్చుతోంది.ఇలా మొత్తం రోజుకు సుమారు 3 వేల మందికి పైగా ప్రవాసులకు అన్ని సౌకర్యాలు అందించడంతో ప్రభుత్వానికి తడిచిమోపెడు అవుతోంది.ఈ ఖర్చులను భరించలేక సొంత ఖర్చులతో వెళ్ళే వారిని తొందరగా పంపేస్తూ ఖర్చు చేసుకోలేని వారిని స్థానికంగా ఉన్న జైళ్ళకు తరలిస్తున్నారు.

ప్రస్తుతం వీరందరూ టిక్కెట్ల కోసం వెయిటింగ్ లిస్టు లో ఉన్నారని టిక్కెట్లు సెటిల్ అయ్యాక వారిని దేశం నుంచీ పంపించి వేస్తామని అధికారులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube