ఈ మధ్య కాలంలో స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది కిడ్నీ స్టోన్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.మూత్రపిండాల లోపలి పొరలో కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు పేరుకుపోయి.
అవి రాళ్లుగా మారతాయి.మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడినప్పుడు.
వీపు, బొడ్డు భాగాల్లో తరచూ నొప్పి రావడం, మూత్ర విసర్జన చేసేటప్పుడు కష్టంగా ఉండటం, జ్వరం, చలి, వాంతులు వంటి ఎన్నో లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.అలాంటప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించి మెడిసన్ వాడటంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.
ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధ పడే వారు కొన్ని కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.అలాంటి వాటిలో మినపప్పు ఒకటి.నిజానికి మినపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.కాల్షియం, మెగ్నిషియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, ఫైబర్, విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు మినపప్పులో నిండి ఉంటాయి.
అయితే ఎన్ని పోషకాలు ఉన్నప్పటికీ.ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ.మినపప్పును అతిగా తీసుకుంటే మాత్రం అనేక సమస్యలు వస్తాయి.ముఖ్యంగా మినపప్పును ఓవర్ గా తీసుకోవడం వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది.ఫలితంగా కిడ్నీల్లో రాళ్లు ఎర్పడతాయి.అయితే ఆల్రెడీ కిడ్నీలో రాళ్లు ఉన్న వారు మినపప్పు తింటే సమస్య మరింత డేంజర్‌గా మారుతుంది.
కాబట్టి, కిడ్నీలో రాళ్లు ఉన్న వారు మినపప్పుతో జాగ్రత్తగా ఉండాలి.
ఇక కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్న వారే కాదు.కీళ్ల నొప్పులతో బాధ పడే వారు కూడా మినపప్పును ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది.ఎందుకంటే, కీళ్ల నొప్పిలను మరింత పెరిగేలా చేయడంలో మినపప్పు సహకరిస్తుంది.
అలాగే మినపప్పును అధికంగా తీసుకోవడం వల్ల మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి.