దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ రాత్రిపూట కర్ఫ్యూ… వీకెండ్ లాక్ డౌన్ లు అమలు చేస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి.ఇదే క్రమంలో రాజకీయ పార్టీల నేతలు కూడా కరోనా బారిన పడుతున్నారు.
మరోపక్క రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి.ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి కరోనా కారణంగా మృతి చెందటంతో పాటు రాష్ట్రంలో వైరస్ విజృంభణ ఎక్కువగా ఉండటంతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఎన్నికల సంఘానికి కీలక సూచనలు ఇచ్చారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో మొత్తం ఎనిమిది దశల పోలింగ్ నిర్వహించడానికి రెడీ అవటం తెలిసిందే.
ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ పూర్తి అవడం జరిగింది.
ఇలాంటి తరుణంలో మిగిలి ఉన్న నాలుగు దశల్లో పోలింగ్ ఒకేసారి ఒక విడతలో పూర్తి చేయాలని సోషల్ మీడియా సాక్షిగా ఎన్నికల కమిషన్ ని మమతా బెనర్జీ కోరారు.రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు.
మరి కేంద్ర ఎన్నికల సంఘం దీదీ ఇచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటా పోటీ తృణమూల్- బీజేపీ పార్టీల మధ్య నెలకొంది.
మొదటి నుండి ఎనిమిది దశ ఎన్నికల పోలింగ్ ని మమతా బెనర్జీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు.అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో నాలుగు విడుదల పోలింగ్ కచ్చితంగా కుదించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరి చివరాకరికి ఈసీ నిర్ణయం ఏ విధంగా ఉంటుందో చూడాలి.
.