ప్రపంచంలో సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెందింది.మనుషులు తన మేధో శక్తిని అపరిమితంగా విస్తరింప చేశారు.
రోదసీలో అడుగుపెట్టి అక్కడ కూడా నివాసాలు ఏర్పరుచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.అయినా మన భారతదేశంలో మూఢాచారాలు, అంధవిశ్వాసాలు కొనసాగుతున్నాయి.
మరి లోపం ఎక్కడుంది.మన విద్యావ్యవస్థలోనా? సమాజంలోనా? చట్టాల్లోనా? ఈ ప్రశ్నలకు సమాధానమే దొరకదు.
ఒక వైపు భారతదేశం 21వ శతాబ్దపు సూపర్ పవర్ గా మారబోతోందని ఊహాగానాలు, మరోవైపు 18వ శతాబ్దపు మూఢ విశ్వాసాల నుండి మనుషులు బయట పడకపోవడం శోచనీయం.ఇకపోతే పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి.
కొందరు మహారాష్ట్ర కు చెందిన ముఠా సభ్యులు మహిళలతో పూజలు చేస్తే డబ్బులు వర్షంలా కురుస్తాయని నమ్మి 20 లక్షలు, బంగారం ఆశ చూపి దివ్య అనే యువతిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించారట
ఈ క్రమంలో బారిష్ పేరిట పూజలు చేస్తే డబ్బులు వర్షంలా కురుస్తాయని ఆశ పడిందట మహారాష్ట్ర గ్యాంగ్.ఇక ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో క్షుద్రపూజల ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారట.
కాగా క్షుద్రపూజల వెనుక మహారాష్ట్ర పూజారి హస్తం కూడా ఉన్నట్లు గుర్తించారట పోలీసులు.