కాలం మారుతున్నా సమాజంలో మహిళలపై వేధింపులు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలను అమలు చేస్తున్నా నిందితుల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు.
దారుణం ఏమిటంటే సమాజంలో అమ్మాయిలపై పురుషులతో పాటు మహిళలు సైతం వేధింపులకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఒక ఘటనను సింగర్ చిన్మయి ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు.
ఒక లేడీస్ హాస్టల్ లో వార్డెన్ వికృత చేష్టలను సోషల్ మీడియా ద్వారా చిన్మయి వెల్లడించారు.గతంలో గుజరాత్ లో అమ్మాయిలతో వార్డెన్ అసభ్యంగా ప్రవర్తించిన వార్తల గురించి మనం విన్నామని హైదరాబాద్ నగరంలో సైతం అలాంటి వార్డెన్లు ఉన్నారని చిన్మయి పేర్కొన్నారు.
బాధితురాలు చెప్పిన విషయాలను చిన్మయి సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు.చిన్మయి ట్వీట్ ప్రకారం ఒక బాలిక చదువు కోసం 2015 సంవత్సరంలో ఒక ప్రైవేట్ స్కూల్ లో చేరి అదే స్కూల్ కు చెందిన హాస్టల్ లో ఉండేది.
అయితే ఆ హాస్టల్ వార్డెన్ ఆరోగ్య సమస్యల వల్ల రెస్ట్ తీసుకోవాలని అనుకునే అమ్మాయిల విషయంలో కఠినంగా వ్యవహరించేది.అమ్మాయిలు ఎవరైనా పీరియడ్స్ సమస్యతో రెస్ట్ తీసుకోవడానికి వచ్చామని చెప్పినా బట్టలు విప్పి చూపించమంటూ దారుణంగా ప్రవర్తించేది.బాధిత బాలిక కూడా అదే సమస్యతో హాస్టల్ కు వెళ్లగా బాలికను రెస్ట్ తీసుకోవడానికి అనుమతించకుండా బట్టలు విప్పి చూపించాలని వార్డెన్ కోరింది.
ఆ తరువాత బాలిక చెప్పిన మాటలు నిజమేనని తేలడంతో హాస్టల్ లోకి అనుమతించిందని సమాజంలో చోటు చేసుకుంటున్న దారుణ ఘటనల గురించి బాధిత బాలిక చిన్మయికి తెలిపింది.
చిన్మయి సోషల్ మీడియా ద్వారా సమాజంలో ఇలాంటి చీడపురుగులు ఉన్నారంటూ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.హైదరాబాద్ లోని లేడీస్ హాస్టల్స్ లో జరుగుతున్న దారుణాలను చిన్మయి వెలుగులోకి తెచ్చింది.