ఆయుధ పూజను ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు?

మన పురాణాల ప్రకారం ఆయుధ పూజ విజయదశమి ముందు రోజు నిర్వహిస్తారు.ఆయుధ పూజ అంటే ఎవరి వృత్తికి కి సంబంధించిన వారి పనిముట్లను పూజించడం ఆనవాయితీగా వస్తుంది.

 Importance Of Ayudha Pooja , Vijaya Dashami, Kurukshetra War , Ayudha Pooja, Das-TeluguStop.com

ఒక రైతు వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్లును పూజిస్తాడు.ఇలా ఎవరి వృత్తిపరంగా వారి సాధనాలను పూజిస్తూ ఉంటారు.

అలా ఎందుకు పూజిస్తారంటే దేవదానవ సంగ్రామంలో ఉత్తరాషాడ శ్రవణం నక్షత్రాల మధ్య అభిజిత్ లగ్నంలో విజయం సాధించడం జరిగింది కాబట్టి, విజయదశమి ముందు రోజున ఈ ఆయుధాలకు పూజలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది.
పురాణాల ప్రకారం దుర్గాదేవి మహిషాసుర మర్దిని గా రాక్షసులను సంహరిస్తుంది.

కాబట్టి ఆరోజున ఆయుధాలకు పూజలు నిర్వహించడం జరిగింది.అప్పటి నుంచి మన ఇళ్లలో, మన వృత్తి పరంగా ఉండేటటువంటి సాధనాలను పూజ చేయటం ద్వారా విజయం కలుగుతుందని నమ్ముతారు.

అర్జునుడు తన వస్తువులను చెట్టు లో దాచి పెట్టి విజయదశమికి ఒకరోజు ముందు న ఆ పనిముట్లను తీసుకొని కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లగా, కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధిస్తాడు.అందుకు గుర్తుగా విజయదశమి ముందు రోజు మన వాడే సాధనాలకు పూజ చేయడం ద్వారా మనం చేసేటటువంటి పనులలో కూడా విజయం కలుగుతుందని ప్రగాఢ నమ్మకం.

మనం నిర్వహించవలసిన ఆయుధాలను శుభ్రం చేసే వాటిని పసుపు, కుంకుమలు, పువ్వులతో అలంకరించి వాటిని వరుస క్రమంలో పెడతారు.అలా పెట్టిన సాధనలకు గుమ్మడి కాయను లేదా కొబ్బరి కాయతో దిష్టి తీసిదానిని పగల కొడతారు.

ఈ విధంగా వాహనాలకు, వ్యవసాయ పనిముట్ల కు, ఈ విధంగా ప్రతి రంగంలో పనిచేసేటటువంటి అన్నిరకాల యంత్రాలకి కూడా దశమి కి ముందు రోజు ఈ ఆయుధాలు పూజను నిర్వహిస్తారు.ఇలా చేయడం ద్వారా మనకి కూడా విజయం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube