భారతదేశంలో సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు.భక్తి అనేది మనిషిని ఎంతటి పనినైనా చేయిస్తుంది.
మనదేశంలో రోజురోజుకీ భక్తి పెరగడం వల్ల ఇష్టమైన దేవుళ్ళకు ఆలయాలను కట్టి పూజిస్తున్నారు.అంతేకాదు వారికి ఇష్టమైన రాజకీయ నాయకులకు, సినిమా హీరో, హీరోయిన్ లకు కూడా గుడి కట్టేస్తున్నారు మన భారతీయులు.
ఇక్కడ మాత్రం జీవులకు కూడా గుడి కట్టేశారు.మన భారతదేశంలోనే ఈ వింత ఆలయాలను నిర్మించారు.
మరి ఆ ఆలయాల యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.
బీహార్ లోని వైశాలి జిల్లాలో బాలి అనే ప్రాంతంలో గబ్బిలాల కోసం ప్రత్యేకంగా ఒక గుహ ఉంది.అందులో ఎక్కువగా గబ్బిలాలు నివసిస్తూ ఉంటాయి.అయితే గ్రామస్తుల కథనం ప్రకారం ఈ బాలి అనే గుహ కింద ఒక నది ప్రవహిస్తూ ఉందని, ఆ నది ఎంతో పవిత్రమైనదని, ఈ నదిలోని నీరు త్రాగడం వల్ల వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు గానీ ఉండవని ఆ గ్రామస్తుల నమ్మకం.
అందువల్ల ఈ బాలి గుహను ప్రజలు ఎంతో భక్తిగా ఆరాధిస్తారు.అయితే గబ్బిలాల వల్ల వారికి ఎటువంటి సమస్య లేదని వారి నమ్మకం.అందుకోసమే ఈ గబ్బిలాలను ఎంతో భక్తి భావంతో పూజిస్తారు.గబ్బిలాలు పగటి సమయంలో గుహలో ఉండి, కేవలం రాత్రిపూట మాత్రమే సంచరిస్తాయి.
ఎందుకంటే ఇవి నిశాచర జీవులు కాబట్టి.
దోమకు గుడి కట్టారు అన్న విషయం వినగానే ఎవరికైనా ఎంతో హాస్యాస్పదంగా ఉంటుంది.అయితే ఇది అందరూ నమ్మవలసిన నిజం.దోమకు గుడి మరెక్కడో కాదు మన తెలుగు రాష్ట్రమైన హైదరాబాద్ సమీప ప్రాంతాలలో దోమకు గుడి కట్టారు.
దోమ కాటు వల్ల వచ్చే వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహన కలిగి, ప్రజలను చైతన్య పరచాలని హైదరాబాద్ కు చెందిన ఎం సతీష్ రెడ్డి అనే డాక్టర్ ఈ ఆలయాన్ని నిర్మించాడు.అయితే 2008వ సంవత్సరంలో నిర్మించిన ఈ ఆలయానికి ఐదు వేల రూపాయలు ఖర్చు చేశాడు.
దేశంలో కప్పకు ఉన్న ఏకైక ఆలయం ఉత్తరప్రదేశ్ లోని లఖీమ్ పుర్ జిల్లాకు చెందిన ఆయల్ లో కప్పకు ఆలయం కట్టించారు.అయితే మన రాష్ట్రాలలో కప్పను వర్షం రాని సమయంలో పూజిస్తారు అలా కప్పను పూజించడం వల్ల వర్షం కురుస్తుందని మనందరి భావన కూడా.అయితే మండూక తంత్రం ఆధారంగా శివాజీ కప్ప వెనుక ప్రాంతంలో కూర్చుని ఉంటాడని ఇక్కడి ప్రజలు చెబుతారు.అయితే వరదలు కరువు కాటకాలు, అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందడానికి రెండు వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు.
అయితే ఈ ఆలయంలో ఒక శివలింగం ఉంది.అది ఎప్పటికప్పుడు రంగులు మారుతూ ఉండడం ఇక్కడ ప్రత్యేకత.అంతేకాకుండా అన్ని ఆలయాలలో నంది కూర్చున్న విగ్రహాలు కనిపిస్తాయి.అయితే ఇక్కడ నంది నిలబడినటువంటి విగ్రహం కనిపిస్తుంది.