ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.నిన్న రాత్రే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు.
విమానశ్రయం నుండి నేరుగా ఆయన తన అధికార నివాసానికి చేరుకున్నారు.సీఎం జగన్ తో పాటు పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్ సభ పక్ష నేత మిధున్ రెడ్డి, ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఢిల్లీ వెళ్లడం జరిగింది.
కాగా ఈరోజు మధ్యాహ్నం సీఎం జగన్ ప్రధాని మోడీతో భేటీ కావడం జరిగింది.
ఈ క్రమంలో ప్రధాని మోడీతో భేటీ తర్వాత సీఎం జగన్.సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.“రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానమంత్రి శ్రీ మోడీ గారితో చర్చించడం జరిగింది.రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలని, ప్రత్యేక హోదాతో పాటు, పలు పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరిన నేపథ్యంలో ప్రధాని గారు సానుకూలంగా స్పందించారు”.అని సీఎం జగన్ తెలియజేయడం జరిగింది.







