ఏకే రావు పీకే రావు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హాట్ బ్యూటీ దక్ష నగార్కర్ ఆ తర్వాత తేజ డైరక్షన్ లో వచ్చిన హోరా హోరీ సినిమాలో నటించింది.ఆ తర్వాత హుశారు, జాంబి రెడ్డి సినిమాలు చేసింది అమ్మడు.
ఇక అక్కినేని మల్టీస్టారర్ బంగార్రాజు సినిమాలో కూడా దక్ష నగార్కర్ నటించింది. లీడ్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉన్నా సరే వచ్చిన చిన్నా చితకా అవకాశాలను కూడా కాదనకుండా చేస్తుంది దక్ష నగార్కర్.
ఎలాగోలా సినిమాల్లో ఉండటమే లక్ష్యంగా అమ్మడు సినిమాలు చేస్తూ వస్తుంది.
కనిపించే పాత్ర చిన్నదైనా సరే దక్ష తన మార్క్ హాట్ నెస్ తో అలరిస్తుంది.
ఇక సినిమాలు చేసినా చేయకపోయినా సోషల్ మీడియాలో అమ్మడు తన హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది.దక్ష నగార్కర్ లేటెస్ట్ ఫోటో షూట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
జీన్స్ ప్యాంట్.బ్లాక్ టాప్ తో దక్ష లేటెస్ట్ పిక్ కుర్రాళ్లని తెగ ఆకట్టుకుంటుంది.
సరైన ఛాన్స్ రావాలే కాని స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన క్వాలిటీస్ ఉన్న దక్ష నగార్కర్ కి ఎందుకో అలాంటి ఛాన్సులు రావట్లేదని చెప్పొచ్చు.వచ్చిన చిన్న అవకాశమైన చేస్తూ ఇలా ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది అమ్మడు.
ప్రస్తుతం దక్ష రవితేజ హీరోగా వస్తున్న రావణాసుర సినిమాలో నటిస్తుంది.ఈ సినిమాతో అయినా అమ్మడు ఫేట్ మారుతుందేమో చూడాలి.