మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు మళ్లీ ఝలక్

ఏపీలో అమలవుతున్న పథకాలపై కొందరు మంత్రులకు కనీస అవగాహన కూడా ఉండటంలేదని ఇటీవల తరచూ విమర్శలు వినిపిస్తున్నాయి.శనివారం విశాఖలో జరిగిన జెడ్పీ సమావేశం మంత్రుల అవగాహన లేమి కారణంగా రసాభాసగా మారింది.

 Shock Again To Minister Gudivada Amarnath In Zp Meeting Details, Andhra Pradesh-TeluguStop.com

ముఖ్యంగా జల కళ పథకం అమలుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న విషయాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి.దీంతో జెడ్పీ సమావేశం వాడీవేడిగా సాగింది.

ఈ సమావేశానికి ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు హాజరయ్యారు.ఈ సందర్భంగా జలకళ పథకం అమలుపై సొంత పార్టీ సభ్యులే మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను నిలదీశారు.

జిల్లాలో వేసిన మొదటి బోరుకు ఇప్పటి వరకూ విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదని ప్రశ్నించారు.రైతుల సమస్యల పరిష్కారంపైనా సభలో అధికార పార్టీ సభ్యులు మంత్రిని నిలదీశారు.ఈ అంశంపై సభలో చాలాసేపు వాదోపవాదాలు నడిచాయి.దీంతో మంత్రికి దిమ్మతిరిగింది.

గ్రూపులకు ట్రాక్టర్లు ఇవ్వవద్దని అవి ఏ మేరకు ఉపయోగపడవు అని కొందరు మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు.

Telugu Andhra Pradesh, Deputycm, Farmers, Jalakala Scheme, Vishaka Zp, Vishakapa

వైద్యారోగ్యంపై విపరీతమైన స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.నర్సీపట్నం వైద్యారోగ్య కేంద్రంతో పాటు కేజీహెచ్ నిర్వహణపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి.అయితే మంత్రి హోదాలో ఈ సమస్యలపై గుడివాడ అమర్నాథ్‌కు అవగాహన లేకపోవడంతో ఆయనకు ఏం వివరణ ఇవ్వాలో అర్ధం కాలేదు.

అటు పలు సమస్యల పరిష్కారంపై బూడి ముత్యాలనాయుడు ఇచ్చిన క్లారిఫికేషన్ కూడా వైసీపీ సభ్యులకు సంతృప్తిగా అనిపించలేదు.

Telugu Andhra Pradesh, Deputycm, Farmers, Jalakala Scheme, Vishaka Zp, Vishakapa

కాగా ఇటీవల కొత్త జిల్లాలు ఏర్పాటు అయిన నేపథ్యంలో విశాఖ జెడ్పీ సమావేశానికి ఇద్దరు కలెక్టర్లు ప్రత్యక్షం అయ్యారు.అందులో ఒకరు విశాఖ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కాగా మరొకరు అల్లూరి మన్యం జిల్లా కలెక్టర్.వీరిద్దరూ జెడ్పీ సమావేశంలో సమస్యలు విన్నారు.

అయితే వీటి పరిష్కారంపై తమకు క్లారిఫికేషన్ వెంటనే ఇవ్వాలని సభ్యులు పట్టుబట్టడంతో మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు చుక్కలు కనిపించాయి.సభ్యులు అడిగిన ప్రశ్నలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నేతలు తీరు మార్చుకోవాలంటూ బూడి ముత్యాలనాయుడు హితవు పలికారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube