హిందూ దేవాలయాలకు, హిందూ మతానికి ఇండియా అతి పెద్ద దేశం అనుకుంటాం, హిందూ దేవాలయాలు ఇండియాలో ఉన్నంతగా మరే దేశంలో కూడా లేవని కొందరు అభిప్రాయ పడుతూ ఉంటారు.ప్రస్తుతం ఇండియాలో హిందువులు ఎక్కువ ఉన్నారు ఆ మాట వాస్తవమే, ప్రస్తుతం ఇండియాలోనే దేవాలయాల సందర్శణ ఎక్కువ ఉంటుంది అది కూడా నిజమే.
కాని ఇండియాలోనే అతి పెద్ద హిందూ దేవాలయాలు ఉన్నాయి అనుకుంటే మాత్రం పప్పులో కాలు వేసినట్లే.ఎందుకంటే ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అద్బుతమైన హిందూ దేవాలయాలు ఉన్నాయి.
కంబోడియాలో ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే లేనటువంటి అతి పెద్ద హిందూ దేవాలయం, అది కూడా విష్ణు దేవాలయం ఉంది.

కంబోడియా ఒక హిందూ దేశంగా ఎవరు భావించరు.కాని పూర్వ కాలంలో కాంబోడియా హిందూ రాజుల పాలనలో వందల ఏళ్లు ఉంది.అందుకే అక్కడ హిందూ రాజులు పెద్ద ఎత్తున గుడులు నిర్మించారు.
ఇక్కడ చెప్పుకోవల్సిన గుడి ఏంటీ అంటే ఆంగ్కోర్ వాట్ దేవాలయం.ఈ దేవాలయం కొన్నాళ్ల క్రితం ఎవరికి తెలియదు.
అసలు అక్కడో దేవాలయం ఉన్న విషయం కూడా కాంబోడియా ప్రజలకు తెలియదు.కాని ప్రెంచ్ ఒకప్పుడు కాంబోడియాను ఆక్రమించుకుని ఆ దేవాలయాన్ని కనిపెట్టింది.
ప్రెంచ్‌కు చెందిన టూరిస్టులు కొందరు కాంబోడియాలో పర్యటించిన సమయంలో దేవాలయంకు చెందిన అవశేషాలు బయట పడ్డాయి.
అప్పటి నుండి కూడా పలు ప్రపంచ దేశాలు కూడా ఆంగ్కోర్ వాట్ దేవాలయం గురించి పరిశోదనలు చేస్తూ సరికొత్త విషయాలను తెలుసుకుంటూనే ఉన్నారు.
కొన్నాళ్ల క్రితం నాసా ఉపగ్రహం ఆంగ్కోర్ వాట్‌కు చెందిన కొన్ని చిత్రాలను సేకరించింది.ఆ చిత్రాలను చూసి అవాక్కయిన పరిశోదన సంస్థ మరింతగా అధ్యయనం చేసింది.ఉపగ్రహం సాయంతో ఏకంగా 200 అద్బుతమైన నాగరికతను తెలియజేసే పెయింటింగ్స్‌ను కనిపెట్టారు.అప్పటి రాజు తన చరిత్ర, తన రాజ్యం చరిత్రతో పాటు తాను నిర్మించిన ఆంగ్కోర్ వాట్ దేవాలయం గురించి తెలిసేలా కొన్ని ఆధారాలను ఇచ్చాడు.

ఆ దేవాలయ నిర్మాణం ఇప్పటి టెక్నాలజీకి అర్థం కాకుండా అద్బుతంగా ఉంది.ఇంత టెక్నాలజీ, యంత్రాలు పెరిగాయి.అయినా కూడా ఆ దేవాలయం వంటి దేవాలయం నిర్మాణం అసాధ్యం అంటున్నారు.అంతటి వినూత్న డిజైన్స్‌తో ఆ దేవాలయాన్ని నిర్మించారు.అన్ని దేవాలయాలకు తూర్పు ద్వారం ఉంటే ఈ దేవాలయంకు మాత్రం పశ్చిమ ద్వారం ఉంటుంది.విభిన్న రీతిలో ఉండే ఈ దేవాలయం అత్యంత విశిష్టతను కలిగి ఉంది.
కంబోడియాకు వెళ్లే టూరిస్టుల్లో 85 శాతం మంది ఆ దేవాయం గురించి తెలుసుకునేందుకు వెళ్తారు.
ఆ దేవాలయం ప్రాంగణంలో నీరు కింది నుండి పైకి ప్రవహిస్తూ ఉంటుంది.
అది ఎలా సాధ్యమో ఇప్పటికి కూడా శాస్త్రవేత్తలు తెలుసుకోలేక పోయారు.కొన్ని వందల ఏళ్లు అయినా కూడా ఆ గుడిలో ఉన్న కొన్ని స్థూపాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి.
గుడి సంరక్షణ లేక పోవడం వల్ల కాస్త దెబ్బ తిన్నా ఇంకా వెయ్యి ఏళ్లు అయినా ఉండేలా గుడి ఉందని చూసిన వారు చెబుతున్నారు.మొత్తానికి ప్రతి ఒక్క హిందువు ఈ దేవాలయం గురించి తెలుసుకోవడంతో పాటు, జీవితంలో ఒక్కసారైనా ఆ దేవాలయాన్ని సందర్శించాలి.

సందర్శించే అదృష్టం అందరికి రాదు, కనీసం ఈ విషయాన్ని షేర్ చేసి నలుగురు ఈ గుడి గురించి తెలుసుకునేలా చేయండి.
DEVOTIONAL