వినాయకుణ్ణి ఎలా పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందో తెలుసా ?

సిద్ది గణపతిని పూజించటం వలన అష్టైశ్వర్యాలు, అష్టసిద్దులూ కలుగుతాయి.అసలు సిద్ది గణపతి ఎవరు? ఆయనను పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయా? తాంత్రికులు వినాయకుణ్ణి 16 రూపాల్లో పూజిస్తూ ఉంటారు.నిజానికి వినాయకునికి 32 రూపాలు ఉన్నాయి.అయితే వీటిలో 16 రూపాలు బాగా ప్రసిద్ధి చెందినవి.ఆ రూపాల్లో సిద్ది గణపతి రూపం ఒకటి.

 Siddhi Ganapathi Pooja Procedure-TeluguStop.com

దీనినే పింగళ గణపతి అని కూడా అంటారు.

బంగారు వర్ణంలో ఉండే సిద్ది గణపతిని పూజిస్తే చేసే పనిలో విజయం చేకూరుతుంది.ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి.

కుడి చేతిలో మామిడి పండు, పరశువు ఉంటాయి.ఎడమ చేతిలో పూలగుత్తి, చెరుకుగడలు ధరించి, తొండంతో నువ్వుల కుడుములు పట్టుకుని దర్శనమిస్తారు.

సిద్ది గణపతికి అష్ట సిద్ధులను ప్రసాదించే శక్తి ఉండుట వలన ఏ పనైనా చేపట్టే ముందు సిద్ది గణపతికి ఆరాధన చేస్తే ఆ పని విజయవంతం అవుతుంది.ప్రతి రోజు సిద్ది గణపతిని ఆరాధించటం వలన మనలో మంచి ఆలోచనలు వస్తాయి.

మనం నిరాశతో వదిలేసినా పనులు కూడా సఫలం అవుతాయి.

సిద్ది గణపతిని ‘పక్వచుత ఫల పుష్పమంజరీ ఇక్షుదండ తిలమోదకై స్సహ ఉద్వాహన్ పరశుమస్తు తే నమః శ్రీ సమృద్ధియుత హేమం పింగళ’ అనే మంత్రంతో ధ్యానించాలి.

ఇలా సిద్ది గణపతిని ధ్యానిస్తే ఐశ్వర్యం కలగటమే కాకుండా అనుకున్న పనులు అన్ని విజయవంతం అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube