శ్రావణ మాసం, అమావాస్య సోమవారం, సూర్య గ్రహణం ఈ నాలుగు ఒకే రోజు.. ఇలా చేస్తే అదృష్టం కలుగుతుంది

శ్రావణ మాసం,అమావాస్య సోమవారం, సూర్య గ్రహణం ఈ నాలుగు ఒకే రోజు రావటం చాలా అరుదుగా జరుగుతుంది.ఈ రోజు శివుణ్ణి పూజించటం మరియు శివునికి అభిషేకాలు చేయటం వలన తెలిసి తెలియక చేసిన పాపాలు,తప్పులు అన్ని హరించుకుపోతాయి.

 Significance Of Shravana Masam Amavasya Monday Surya Grahanam Details, Shravana-TeluguStop.com

ఈ అమావాస్యను సోమవతి అమావాస్య అని అంటారు.ఈ రోజు కోసం సప్త ఋషులు,నవగ్రహాలు,ముక్కోటి దేవతలు ఎదురు చూస్తూ ఉంటారు.

శ్రావణ మాసంలో వచ్చే ఈ సోమవతి అమావాస్యను మహా శివరాత్రి కన్నా మంచి రోజని పండితులు చెప్పుతున్నారు.అందువలన ఆ రోజు శివునికి అభిషేకం చేసి ఉపవాసం ఉంటె పుణ్యం వస్తుందని పండితులు చెప్పుతున్నారు.

ఈ రోజున అభిషేకం చేస్తారు ఎందుకంటే ఈ రోజు సకల శక్తులు లింగ రూపుడైన శివుడులో కొలువై ఉంటాయి .అందువల్ల చేసిన పాపాలు తొలగిపోతాయని చెప్పుతారు.దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉంది.ఆ కథ గురించి తెలుసుకుందాం.ఒక ఊరిలో ఒక సాధువు ఒక వ్యాపారి ఇంటికి వస్తూ ఉంటాడు.ఒక రోజు సాధువు ఆ వ్యాపారి ఇంటిలో పెళ్లి కానీ కన్యను చూసి దీవించకుండా వెళ్లిపోవడంతో ఆ కుటుంబం చాలా బాధపడుతుంది.

ఆ కుటుంబం బాగా ఆలోచించి ఆ కన్య జాతకాన్ని పురోహితునికి చూపిస్తే ఆమెకు వివాహం అయితే భర్త తొందరగా చనిపోతాడని చెప్పుతాడు.

Telugu Abhisekham, Amavasya Monday, Hindu Puranas, Maha Shivudu, Pooja, Shravana

అప్పుడు దీనికి పరిష్కారం ఏమిటని అడగగా సింఘాల్ ప్రాంతంలోని ఒక చాకలి స్త్రీకుంకుమ అడిగి ధరిస్తే దోషం పోతుందని చెప్పుతారు.అప్పుడు ఆ వ్యాపారి ఆ కన్యను, చిన్న కొడుకుతో సింఘాల్ ప్రాంతానికి పంపుతాడు.దారి మధ్యలో నది దాటుతూ ఉండగా అప్పుడే పుట్టిన గద్ద పిల్లను చంపి తినటానికి పాము రావటం కనపడుతుంది.

ఆ కన్య పామును చంపి గద్ద పిల్లను కాపాడుతుంది.అప్పుడు ఆ గద్ద పిల్ల చాకలి స్త్రీ ఇంటికి దారి చెప్పుతుంది.ఆ కన్య ఆ చాకలి స్త్రీకి కొన్ని రోజుల పాటు సేవ చేస్తే సోమవతి అమావాస్య నాడు కుంకుమ ఇవ్వటంతో ఆ కన్య దోషం పోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube