ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు సాధు జంతువులను పెంచుకోవడానికి తెగ ఇష్టపడి పోతున్నారు.ఇందులో భాగంగానే కొందరు పిల్లులు, కుక్కలు అలాగే ఇతర కొన్ని జంతువులను ఇంట్లో పెంచుకుంటున్నారు.
భారతదేశంలో అయితే వీటి వరకే పరిమితమైన వారు విదేశాల్లో మాత్రం పాములు, సింహాలు, పులులు లాంటి వాటిని కూడా పెంచుకుంటూ ఉంటారు.అయితే తాజాగా భారతదేశంలో ఒకరు పెంచుకుంటున్న ఒక పిల్లి తప్పిపోయినందుకు దానిని కనిపెట్టి ఇచ్చినవారికి 15 వేల రివార్డ్ అమౌంట్ ను ప్రకటించారు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
భారతదేశం మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్ వై కమిషనర్ భార్య తాజాగా గోరక్ పూర్ రైల్వే స్టేషన్ దగ్గర రైలు కోసం వెయిట్ చేస్తుండగా అక్కడ వారి పిల్లి మిస్ అయిపోయింది.
మామూలుగా ఎవరైనా పిల్లి పోతే పోయింది అని అనుకోని ఇంకోటి తెచ్చుకుందామని భావించే రోజులలో వారు మాత్రం తమ పిల్లిని కావాలంటూ ఏకంగా ఆ పిల్లిని తెచ్చిన వారికి అమౌంట్ కూడా ప్రకటించారు.ట్రైన్ కోసం వెయిటింగ్ చేస్తున్న సమయంలో ఆ పిల్లి తమ దగ్గర నుంచి తప్పిపోయినట్లు వారు చెబుతున్నారు.
రైలు వస్తున్న సమయంలో రైలు చేసిన హారన్ సౌండ్, అలాగే రైలు శబ్దానికి ఆ పిల్లి భయపడిపోయి పారిపోయిందని వారు తెలిపారు.
ఈ పిల్లిని కనుగొనడానికి వారు కొన్ని గుర్తులను కూడా తెలిపారు.ఆ పిల్లికి కేవలం రెండు సంవత్సరాల వయస్సు ఉంటుందని ఆ పిల్లికి పూర్తిగా పచ్చని కళ్ళు, అలాగే ముక్కు పై గోధుమ వర్ణంలో చుక్క ఉంటుందని అందుకు సంబంధించిన గుర్తులను వారు తెలిపారు.ఇందుకు సంబంధించి 11000 రివార్డును ప్రకటించిన వారు ఆ తర్వాత దానిని 15 వేల వరకు పెంచడం జరిగింది.
ఇందుకోసం ఆ రైల్వే స్టేషన్ లో అక్కడక్కడ ఆ పిల్లికి సంబంధించిన ఫోటోలను కూడా వారు పోస్టర్స్ వేయించడం నిజంగా విడ్డూరమే.ఆ పిల్లి తప్పిపోవడంతో చివరికి వారుచేయాల్సిన జర్నీ కూడా క్యాన్సిల్ చేసుకుని గోరక్ పూర్ లోనే ఉండిపోయారు.