సమాజంలో రోజు రోజుకు చీడపురుగులు పెరిగిపోతున్నాయి.ముఖ్యంగా అరచేతిలోకి వచ్చిన ఫోన్లు, చవకగా లభించే నెట్ సదుపాయాల వల్ల కలిగే లాభాల సంగతి పక్కన పెడితే, వీటి వల్ల నష్టం మాత్రం ఎక్కువగానే కలుగుతుంది.
ఈ మధ్య కాలంలో అయితే మహిళలపై అత్యాచారాలు, పిల్లలపై లైంగిక దాడులు కూడా ఎక్కువగా అయ్యాయి.
ఇకపోతే ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది.
ఫోన్ లో నీలిచిత్రాలు చూసి రెండేళ్ల బాలికపై 13 ఏళ్ల బాలుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది.ఆ వివరాలు చూస్తే.
ఫతేపూర్ జిల్లా ఖాగా గ్రామానికి చెందిన బాలుడు నీలిచిత్రాలు చూస్తూ ఉద్రేకానికి లోనై, ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడ.
ఏం జరుగుతుందో అర్ధం కానీ ఆచిన్నారి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లడంతో గాబరా పడిన తల్లిదండ్రులు బాలికను పరిశీలించగా విషయం తెలిసిందట.
వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని గురువారం అదుపోలోకి తీసుకున్నారని సమాచారం.అందుకే పిల్లలకు ఫోన్లు అప్పచెప్పడం ముఖ్యం కాదు.
వారు ఏం చూస్తున్నారో గమనించడం మాత్రం మరవకండి.