చిన్న జీయర్ స్వామిపై కేసు నమోదు చేయాలి

సూర్యాపేట జిల్లా:చిన్న జీయర్ స్వామి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు కుంభం నాగరాజు అన్నారు.

గురువారం జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రీనివాస్ కి పిర్యాదు చేసి మాట్లాడారు.

తెలంగాణలోని అతిపెద్ద జాతర గా పేరుగాంచిన సమ్మక్క సారక్క దేవతలను అవమానపరుస్తూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్న జీయర్ స్వామి పై కేసు నమోదు చేసి తెలంగాణ రాష్ట్రం నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు ఎన్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

A Case Should Be Registered Against The Young Jiyar Swami-చిన్న జీ

Latest Suryapet News