చట్టాలపై బాలికలు ఆవగాహన పెంచుకోవాలి:-న్యాయమూర్తి అబ్దుల్ జావీద్ పాషా

ఖమ్మం:నేటి సమాజంలో బాలికలు చదువుతో పాటు చట్టాలు మరియు బాధ్యతలపై అవగాహన పెంచుకోవాలని న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి మొహమ్మద్ అబ్దుల్ జావీద్ పాషా అన్నారు.న్యాయ సేవా సంస్థ నిర్వహిస్తున్న మహిళా అవగాహనా వారోత్సవాల ముగింపు కార్యక్రమం సోమవారం పోలేపల్లి లోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్లెన్స్ లో జిల్లా న్యాయ సేవాదికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు.

 Girls Should Be Made Aware Of The Laws: -judge Abdul Javed Pasha-TeluguStop.com

మండల,జిల్లా,రాష్ట్ర,జాతీయ స్థాయి లో కోర్టులు వున్న అన్ని ప్రాంతాల్లో ఉచితంగా న్యాయ సేవ లు అందుబాటులో ఉన్నాయి అన్నారు .చట్టంలో పుర్షులు మహిళలకు సమాన హక్కులు ఉన్నాయన్నారు.రాజ్యాంగం కొన్ని సమయాల్లో స్త్రీ కి ప్రత్యేక హక్కులు కల్పించిందన్నారు.స్త్రీ పుట్టక ముందు నుంచి చట్టాలు రక్షిస్తున్నాయన్నారు .గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధ చట్టం ఉందని , ఈ చట్టం ప్రకారం స్కానిoగ్ సెంటర్ లు కడుపులో వున్న బిడ్డ ఆడ లేదా మగ అని బహిర్గతం చేయకూడదని ఇది చట్ట విరుద్ధం అన్నారు .కుటుంబ బంధంలో స్త్రీ గొప్ప తనాన్ని వివరించారు .వివాహ వయస్సు , గృహ హింస చట్టం , న్యాయ సేవలు ఎలా పొందాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు .బాలికలు మహిళలు సమాజంలో ఎదురయ్యే సంఘటనలు వాటిని న్యాయ సేవలు పొందటం పై వివరించారు .గర్భస్థ పరీక్షలు , లింగ నిర్ధారణ పై కటిన చట్టాలు ఉన్నాయి అని అవగాహన కల్పించారు .18 ఏళ్ల లోపు బాలికల లైంగిక వేధంపులపై వివరించారు .సావిత్రిబాయిపులే జీవిత చరిత్ర వివరించారు.ఈకార్యక్రమంలో బోనాల రామకృష్ణ , న్యాయవాదులు పద్మావతి , ఇమ్మడి లక్ష్మీనారాయణ , మాధవి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube