కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ రెడ్డి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు:టీఆర్ఎస్

సూర్యాపేట జిల్లా:కాంగ్రేస్ పార్టీ నాయకుడు పటేల్ రమేష్ రెడ్డి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు ఎదురుదాడికి దిగారు.

శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ దివంగత నాయకుడు వంటెద్దు వెంకన్న భార్య వంటెద్దు నిర్మల మాట్లాడుతూ తన భర్తను హత్య చేసి ఆ కేసును ఉపహరించుకోవాలని,లేదంటె తనను చంపుతానని వడ్డె ఎల్లయ్య బెదిరించాడని అన్నారు.

తన భర్తను రెండు సంవత్సరాల క్రితం దారుణంగా హత్య చేశారని,తాను మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో ఉద్యోగం చేస్తూ తన పిల్లలను‌ పోషిస్తూ జీవిస్తున్నానని అన్నారు.తనకు టిఆర్ఎస్ పార్టీ అండగా నిలిచిందని ఆమె అన్నారు.

Congress Party Leaders Are Promoting Ramesh Reddy Assassination Politics: TRS-�

కాంగ్రెస్ పార్టీ నాయకులు పటేల్ రమేష్ రెడ్డి మహిళ అయిన తనపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.రమేష్ రెడ్డికి మహిళలు అంటే గౌరవం లేదని అన్నారు.

హత్యలు చేసే వారిని రమేష్ రెడ్డి ప్రోత్సహించడం మానుకోవాలని సూచించారు.ఎవరి బలం ఎంతో ఎన్నికల ద్వారా తేల్చుకోవాలని చెప్పారు.

Advertisement

ఉమ్మడి నల్గొండ జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం అధ్యక్షుడు పోలబోయిన నర్సయ్య యాదవ్ మాట్లాడుతూ రాజకీయ హత్యకు కులం పేరు అంటగడుతూ ఎమ్మార్పిఎస్ నాయకులు విమర్శలు చేయడం సరికాదని అన్నారు.యర్కారం గ్రామంలో రెండు సంవత్సరాల క్రితం జరిగిన హత్యను రాజకీయంగా జరిగిన హత్యగానే టిఆర్ఎస్ పార్టీ చూసింది తప్ప ఏనాడు కులపరమైన విమర్శలు చేయలేదని ఆయన అన్నారు.

సూర్యాపేట పట్టణంలో జరిగిన సంఘటనలో సిసి టివి పుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తారని,చట్టప్రకారం కేసు నమోదు చేస్తారని ఆయన అన్నారు.జరిగిన సంఘటనలో మంత్రి జగదీష్ రెడ్డి పేరు తీసుకుని రావడం మంచి పద్దతి కాదని అన్నారు.

సూర్యాపేట జిల్లాలో గత ఏడు సంవత్సరాల నుండి హత్యా రాజకీయాలు,రౌడియిజాన్ని అణచివేసిన మంత్రి జగదీష్ రెడ్డి పరిపాలనలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని తెలిపారు.కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

ఈసమావేశంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు చాంద్ పాషా, 13 వ వార్డు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఫి,పార్టీ నాయకులు చింతలపాటి మధు,కుంభం వెంకన్న యాదవ్,బొడ్డు కిరణ్,వల్లాల సైదులు పిల్లలమర్రి దేవాలయం చైర్మన్,జక్కాల సైదులు యాదవ్,బొర్ర దయాకర్,కుర్ర నరసయ్య పట్టణ తాపి మేస్త్రీల సంఘం అధ్యక్షుడు,సాలయ్య,ప్రవీణ్,మహేష్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

పింఛన్ల కోసం పొద్దంతా పడిగాపులు...!
Advertisement

Latest Suryapet News