ఇల్లు అమ్మిన డబ్బులు చెల్లించాలని ఆమరణ నిరాహార దీక్ష

నల్లగొండ జిల్లా(Nalgonda District):ఇల్లు అమ్మిన డబ్బులు చెల్లించాలని ఓ కుటుంబం ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సంఘటన సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

బాధితులు రావిరాల శ్రీనివాస్,భాగ్యలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.

నల్గొండ(Nalgonda) పట్టణానికి చెందిన రావిరాల శ్రీనివాస్, రావిరాల సత్యం (Ravirala Srinivas, Ravirala Satyam)అన్నదమ్ములు.వీరు నల్గొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్ కు సమీపంలో నిర్మించుకున్న ఇంటిని ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఎండి గులాం హకానీ కి 2 కోట్ల 90 లక్షలకు విక్రయించారు.

Fasting To Death To Pay The Money From The Sale Of The House, Nalgonda District,

కాగా రెండు కోట్ల 10 లక్షలు మాత్రమే తమకు చెల్లించారు.ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఏడాదిన్నర అయినా మిగిలిన రూ.80 లక్షల చెల్లించడంలేదని,అడిగితే వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.ఇకనైనా స్పందించి తమ డబ్బులు వెంటనే చెల్లించాలని కోరారు.

ఈ దీక్షా కార్యక్రమంలో జైసూర్య ఊమేష్,హేమ, కోనం రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
మూసికి పూడిక ముప్పు

Latest Nalgonda News