అయినను పోయి రావలే అసెంబ్లీకి !

చంద్రబాబు అరెస్టు( Chandrababu arrest ) తదనంతర పరిణామాలతో దేశవ్యాప్తంగా ఈ అంశాన్ని చర్చనీయాంశంగా మార్చిన తెలుగుదేశం పార్టీ అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని ఇందుకు అవకాశంగా ఉపయోగించుకుంటుంది.ఈ హడావిడి లో అసెంబ్లీ సమావేశాలలో టిడిపి పాల్గొంటుందా లేదా అన్న సస్పెన్స్ కొనసాగింది.

 Tdlp Decided To Attent Assembly Today, Nara Lokesh, Tdp Mlas, Chandrababu Arrest-TeluguStop.com

అయితే ప్రజాసమస్యలు చర్చించడానికి ఉద్దేశించబడిన అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనాలని టిడిఎల్పి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది.తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తో జూమ్ మీటింగ్ ద్వారా సమావేశమైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర కీలక నేతలు అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనాలా? వద్దా? అని విషయం పై లోకేష్ అభిప్రాయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.

Telugu Ap, Assembly, Chandrababu, Lokesh, Tdp Mlas, Ys Jagan-Telugu Political Ne

అయితే ప్రజా పోరాటమే లక్ష్యంగా ఎంచుకున్నప్పుడు ఎన్ని అవమానాలు ఎదురయినా భరిద్దామని, అతి విలువైన అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించుకోవాలని తమకు జరిగిన అన్యాయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు తెలియ చేద్దామని ఒకవేళ ప్రభత్వం మాట్లాడే అవకాశం ఇవ్వకపోయినా తమ నిరసన అసెంబ్లీ వేదికగానే చూపిద్దామని నాయకులతో లోకేష్ వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది.చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాలతో ఢిల్లీ వేదికగా అనేక జాతీయ మీడియాలకు వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చిన లోకేష్( Nara Lokesh ) తమ పార్టీపై ఆంధ్ర ప్రదేశ్ అదికార పార్టీ ప్రతీకార చర్యలకు పాల్పడుతుందని వివరిస్తున్నారు.

Telugu Ap, Assembly, Chandrababu, Lokesh, Tdp Mlas, Ys Jagan-Telugu Political Ne

మరోపక్క కేంద్ర అధికార నాయకులను కూడా కలిసి తమకు జరుగుతున్న అన్యాయాలను వివరించడానికి సమయం కోరినట్లుగా తెలుస్తుంది.అయితే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలతో బిజీగా ఉన్న కమలనాథులు ఇప్పటివరకు లోకేష్ కు సమయం అయితే ఇవ్వలేదు.ఈ హడావుడి ముగిసిన వెంటనే లోకేష్ తో బేటి అవ్వబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది అయితే అసెంబ్లీకి తెలుగుదేశం ఎమ్మెల్యేలు( TDP mlas ) హాజరైనప్పటికీ సంఖ్యాపరంగా చూస్తే వైసీపీతో పోల్చితే కేవలం పదో వంతు సంఖ్య మాత్రమే ఉన్న తెలుగుదేశం నాయకులు ఏ విధంగా తమ నిరసనను తెలియజేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube