పెన్ పహాడ్ మండలంలో యువకుడు అదృశ్యం

సూర్యాపేట జిల్లా:అత్తారింటికి వెళ్తానని ఇంటి నుండి వెళ్ళిన అల్లుడు కనిపించకుండా పోయిన ఘటన సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం సింగారెడ్డిపాలెం గ్రామంలో వెలుగులోకి వచ్చింది.

పెన్ పహాడ్ ఎస్ఐ పెరిక రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.

సింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన పచ్చిపాల లింగరాజు (25) ఈ నెల 13న చివ్వెంల మండలం తిమ్మాపురం గ్రామంలోని తన అత్తగారింటికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయలుదేరాడు.రెండు రోజులైనా అత్తగారింటికి వెళ్ళకపోవడం,మరే బంధువుల ఇంటికి పోకపోవడంతో ఆచూకీ లభించక అతని తండ్రి పచ్చిపాల మల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Youth Goes Missing In Pen Pahad Mandal, Youth Missing ,Pen Pahad Mandal, Pachipa

ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.అతని వద్ద ఫోన్ కూడా లేదని, బంధువులకు ఫోన్ చేసినా ఆచూకీ లభించలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

పెద్దగట్టును దర్శించుకున్న మంత్రి ఉత్తమ్
Advertisement

Latest Suryapet News