మానవత్వాన్ని చాటిన యువ నేత రాజు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రమాదానికి తీవ్ర గాయాలకు గురైన బాధితున్ని ఆదుకునేందుకు ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని యువ నేత చాటించారు.చందుర్తి లో ఇటీవల ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుండి పడి రెండు కాళ్లు విరిగి, వెన్నుముకకు తీవ్ర గాయమై కరీంనగర్ లోని ఓ ఆసుపత్రిలో సుమారు రెండు లక్షల వరకు ఖర్చు చేసి మెరుగైన వైద్యానికి ఆర్థిక స్తోమత బాగా లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న చందుర్తి మండలం మల్యాల ముద్దుబిడ్డ, తెలంగాణ కోసం ఉద్యమించిన రారాజు ఈర్లపల్లి రాజు మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.

బాధిత కుటుంబానికి బుధవారం రూ.5 వేలు ఆర్థిక సహయం అందించారు.మెరుగైన వైద్యానికి ఆర్థిక సహయం చేసిన రాజుకు కుటుంబ సభ్యులు, చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ తరఫున గ్రామ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

ఇట్టి కార్యక్రమంలో కొత్త గణేష్ గొంటి హేమంత్, ముదాం విజయ్ కోడగంటి నితిన్, అజీమ్ తదితరులు పాల్గొన్నారు.

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

Latest Rajanna Sircilla News