ప్రజల దృష్టి మరల్చడానికే దశాబ్ది ఉత్సవాల ఆరాటం...!

సూర్యాపేట జిల్లా:దశాబ్ద కాలంగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల అమలు చేయడంలో విఫలమైన కేసీఆర్( CM KCR ) ఇప్పుడు ప్రజల దృష్టి మరల్చి,తన వైఫల్యాన్ని కప్పించుకోవడానికి దశాబ్ది ఉత్సవాల పేరుతో హంగామా చేస్తున్నారని తెలంగాణ జన సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు గట్ల రమాశంకర్( Gatla Ramashankar ) అన్నారు.

శనివారం జిల్లా కేంద్రంలో తెలంగాణ జన సమితితెలంగాణ జన సమితి( Telangana Jana Samithi) మూడో ప్లీనరీ పోస్టర్ ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ దశాబ్ద కాలంలో రంగాల వారీగా సాధించిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మిషన్ కాకతీయ,మిషన్ భగీరథ నుండి కాలేశ్వరం వరకు జరిగిన అవినీతిపై న్యాయ విచారణకు సిద్ధమేనాననిసవాల్ విసిరారు.ఈ కార్యక్రమంలో యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ, కిరణ్,లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ కుంచం చంద్రకాంత్,పట్టణ పార్టీ అధ్యక్షులు బందన్ నాయక్,ఎస్సీ,ఎస్టీ సెల్ జిల్లా కన్వీనర్ బచ్చలకూరి గోపి,పార్టీ నాయకులు కృష్ణారెడ్డి,శ్రీనునాయక్,సుమన్ నాయక్, సూర్యనారాయణ, యాకూబ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest Suryapet News