2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన( TDP Janasena Alliance ) కలిసి పోటీ చేయనున్నాయని అధికారికంగా క్లారిటీ వచ్చేసింది.బీజేపీని కూడా కలుపుకుని పోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తుండగా బీజేపీ నిర్ణయం గురించి స్పష్టత రావాల్సి ఉంది.
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పొత్తులపై పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పుగా చూడటం లేదని బీజేపీ అధిష్టానానికి అన్నీ వివరిస్తానని పవన్ చెప్పారని తెలిపారు.కేంద్ర పెద్దలతో చర్చించిన తర్వాత మా అభిప్రాయాలు చెబుతామని పురందేశ్వరి అన్నారు.
పొత్తుల విషయం అధినాయకత్వం చూసుకుంటుందని చంద్రబాబు అరెస్ట్( Chandrababu Arrest ) ను బీజేపీ తప్పుబట్టిందని పురందేశ్వరి కామెంట్లు చేశారు.ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలు ఈ అరెస్ట్ ను ఖండించారని పురందేశ్వరి పేర్కొన్నారు.చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందనే ప్రచారంలో నిజం లేదని ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఐడీ పని చేస్తుందని పురందేశ్వరి( Purandeswari ) అన్నారు.అయితే టీడీపీ జనసేన కలిసినా ఓడిపోతే ఏం చేస్తారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రశ్న వైసీపీ అభిమానుల( YCP ) నుంచి ఎదురవుతూ ఉండగా ఈ ప్రశ్నకు పవన్ ఏమని సమాధానం చెబుతారేమో చూడాల్సి ఉంది.2014 పరిస్థితులకు 2024 పరిస్థితులకు చాలా తేడా ఉంది.చంద్రబాబును ద్వేషించే పవన్ అభిమానులు టీడీపీకి ఓటేస్తారని చెప్పలేం.అదే సమయంలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలలో టీడీపీ రెబల్స్ నుంచి ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.
జనసేన, బీజేపీ( BJP ) నుంచి టికెట్లు ఆశించి నిరాశకు గురైన వాళ్లు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేసే ఛాన్స్ ఉంది.సీఎం జగన్ కు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల సపోర్ట్ ఉంది.2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన మ్యాజిక్ చేస్తాయో లేదో చూడాల్సి ఉంది.