ప్రాణం తీసిన యాట బొక్క

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట రూరల్ మండలం రాజానాయక్ తండాలో మంగళవారం రాత్రి ముత్యాలమ్మ పండుగ జరుపుకున్నారు.

పండుగ సంబరాల్లో గ్రామస్తులు ఉండగా గ్రామానికి చెందిన భూక్య గోపి(59) అనే వ్యక్తి భోజనం చేస్తుండగా బొక్క గొంతులో ఇరుక్కుని ఊపిరాడక పోవడంతో హుటాహుటిన స్థానిక హాస్పిటల్ కు తీసుకెళ్లారు.

హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గోపి బుధవారం మృతి చెందాడు.మృతుని పెద్ద కొడుకు భూక్య సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆర్.సాయిరాం తెలిపారు.గోపి మృతితో రాజా నాయక్ తండాలో పండుగ పూట విషాద ఛాయలు అలుముకున్నాయి.

Yata Bokka Who Took Life-ప్రాణం తీసిన యాట బొక�
ఇంటి పన్ను కట్టని ఇంటి ముందు మున్సిపల్ సిబ్బంది ధర్నా

Latest Suryapet News