డబ్బు కోసం కన్న తల్లి తన కూతురిని పక్కోడి గదిలోకి పంపి... చి.. ఛీ...

ఈ మధ్య కాలంలో కొందరు అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలనే కోరికతో కట్టుకున్న వాళ్లని కడుపున పుట్టిన వాళ్లను కూడా బలవంతంగా వ్యభిచార కూపం లోకి దింపి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు.కాగా తాజాగా ఓ వివాహిత తన కడుపున పుట్టిన కూతురుని బలవంతంగా ఇతరులకు అమ్ముతూ వాటి మీద వచ్చేటువంటి డబ్బుతో జల్సాలు చేస్తోంది.

ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగు చూసింది.పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని చోరూరు పరిసర ప్రాంతంలో ఓ వివాహిత తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది.

అయితే గత కొద్దికాలం క్రితం వివాహిత భర్త గొడవలు, విభేదాల కారణంగా వదిలిపెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.దీంతో అప్పటి నుంచి కుటుంబ పోషణ భారం వివాహిత మోస్తోంది.

అయితే ఈ మధ్య కాలంలో వివాహిత కి అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలనే చెడ్డ బుద్ధి పుట్టింది.ఈ క్రమంలో డబ్బు కోసం ఆడపిల్లలని విక్రయించే వాళ్లని సంప్రదించి 18 సంవత్సరాలు కలిగిన తన కూతుర్ని ఓ వ్యక్తికి అమ్మేసింది.

దాంతో ఆ వ్యక్తి యువతిని బంధించి గత కొద్ది కాలంగా తమ కామ వాంఛలు తీర్చుకుంటున్నాడు.ఈ క్రమంలో వ్యక్తి వివాహిత కి డబ్బు సరిగ్గా ఇవ్వకపోవడంతో ఇటీవలే తన కూతురిని మరో వ్యక్తికి అమ్మేసింది.

కానీ చివరికి ఆ వ్యక్తి కూడా డబ్బులు సరిగ్గా ఇవ్వకపోవడంతో తన కూతురు ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది.ఈ క్రమంలో మరో డబ్బు ఉన్న వ్యక్తికి తన కూతుర్ని అమ్మాలని ప్రయత్నించింది.

దాంతో ఆ యువతి అప్రమత్తమై తల్లి చెర నుంచి తప్పించుకొని దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించింది.అంతేకాకుండా గత రెండు సంవత్సరాలుగా డబ్బు కోసం తన తల్లి చేస్తున్న అఘాయిత్యాల గురించి పోలీసులకు చెప్పుకొని కన్నీరుమున్నీరైంది.దాంతో బాధితురాలు తెలిపిన పూర్తి వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి వివాహితను అరెస్టు చేయడానికి ప్రయత్నించారు.

కానీ వివాహిత ఈ విషయం తెలుసుకొని వెంటనే పరారైంది.దీంతో ఆమెను అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.కాగా ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఆడపిల్లలకి బయట ప్రపంచంలో మాత్రమే కాకుండా ఇంట్లో వాళ్ళతో కూడా రక్షణ లేకపోయిందని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా కడుపున పుట్టిన కూతురుతో పాడు పనులు చేయిస్తూ అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని ప్రయత్నించిన ఆ కసాయి తల్లి ని అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని పోలీసులు కోరుతున్నారు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

తాజా వార్తలు