రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి,ఇరువురికి గాయాలు

సూర్యాపేట జిల్లా:మునగాల మండల పరిధిలోని బరాఖత్ గూడెం గ్రామ శివారులోని ఐఓసి పెట్రోల్ బంక్ ఎదురుగా శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంకిపాడు మండలం,మద్దూరు గ్రామానికి చెందిన విశ్వనాధపల్లి నాగజ్యోతి(38)తలకు బలమైన గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందగా,ఆమె మేనమామ పీతా నాగేశ్వర రావుకు ఎడమ మోకాలికి,ముఖానికి,అతని భార్య పీతా విజయలక్ష్మికి కుడి మోచేతికి తీవ్ర గాయాలయ్యాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మద్దూరు గ్రామానికి చెందిన మృతురాలు విశ్వనాధపల్లి నాగజ్యోతి మరియు మేనమామ పీతా నాగేశ్వరరావు,భార్య విజయలక్ష్మి,వారి కుమారుడు పీతా లీలా వెంకట దుర్గాప్రసాద్ తో కలిసి ఏపి39-డిపి-0126 నెంబర్ గల హోండా 120 కారులో హైద్రాబాద్ లోని దగ్గరి బంధువు దశదిన ఖర్మలకు హాజరై తిరిగి తమ స్వగ్రామానికి వెళ్తుండగా బరాఖత్ గూడెం వద్దకు రాగానే కారు అదుపు తప్పి రోడ్డు పక్కన గల చెట్లను గుద్దుకుంటూ వెళ్లి కాలువలో పడిపోవడంతో ప్రమాదం జరిగింది.

కారును నడుపుతున్న పీతా లీలా వెంకట దుర్గా ప్రసాద్ అతివేగంగా,అజాగ్రత్తగా నడపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.విషయం తెలుసుకున్న మునగాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో కోదాడ ప్రభుత్వ హాస్పిటకు తరలించారు.

Woman Killed, Two Injured In Road Accident-రోడ్డు ప్రమాద

మృతదేహానికి కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పరీక్ష నిర్వహించారు.మృతురాలి భర్త విశ్వనాధపల్లి నాగేంద్రప్రసాద్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ పి.లోకేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనిల్ రావిపూడి అనుకున్న టైమ్ కి చిరంజీవి సినిమాను రిలీజ్ చేస్తాడా..?
Advertisement

Latest Suryapet News