రేపు వైన్ షాపులు మాంసం దుకాణాలు బంద్

నల్లగొండ జిల్లా:రేపు జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నకిరేకల్ మున్సిపల్ పరిధిలో వైన్ షాపులు,మాంసం దుకాణాలు బంద్ కానున్న నేపథ్యంలో శనివారం రాత్రి నుంచి ఎలాంటి జంతువులను వధించరాదని, అన్ని చికెన్,మటన్ షాపులు, చేపల మార్కెట్లు ఆదివారం మూసి వేయాలని నకిరేకల్ మున్సిపల్ కమిషనర్ బాలయ్య సూచించారు.

ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చాలా పట్టణాల్లో ఇవే తరహా ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు.

టీడీపీ నాయకుడికి మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి సంతాపం

Latest Nalgonda News