సూర్యాపేట జిల్లా:సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం అనాజీపురం ఆదర్శ పాఠశాలలో టిజిఎంఎస్అధ్వర్యంలో శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఓటర్ల అవగాహన కార్యక్రమంలో భాగంగా సుమారు 450 మంది విద్యార్థులతో ఆదర్శ పాఠశాల నుండి గ్రామ పంచాయితీ కార్యాలయం వరకు ఫ్లకార్డులు, బ్యానర్లు,కరపత్రాలు ధరించి ఉపాధ్యాయులు,విద్యార్థులు ఓటు యొక్క ప్రాధాన్యత, దానిని సద్వినియోగం చేసుకోవడం,జీవితంలో ఓటు ఒక భాగమని గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద విద్యార్థులతో మానవహారం చేపట్టారు.అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ కోడి లింగయ్య మాట్లాడుతూ ఓటు అనేది మన భవిష్యత్తును మార్చే ఒక వజ్రాయుధమని,ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని, అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన యువతీ,యువకులు ఓటు తప్పకుండా నమోదు చేసుకోవాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో గురుచరణ్, సోమయ్య,వీరారెడ్డి,సంపత్ కుమార్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.