ఈ వృక్షం నాటిన వారికి మరణాంతరం స్వర్గలోకం ప్రాప్తిస్తుందట!

పురాణాల ప్రకారం మన హిందువులు ఎన్నో రకాల మొక్కలను దైవ సమానంగా భావిస్తారు.ఈ క్రమంలోనే చాలామంది వారి ఇంటి ఆవరణంలో ఈ విధమైనటువంటి మొక్కలను పెంచుతూ పూజలు చేస్తారు.

 Who Plant This Tree Will Have Access To Heaven After Death Details, Plant, Wors-TeluguStop.com

దైవ సమానంగా భావించే కొన్ని పెద్ద పెద్ద వృక్షాలకు కూడా పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారు.అయితే ఈ విధంగా భక్తుల చేత ఉసిరి, మర్రి, రావి, అరటి వంటి వృక్షాలకు పూజలు నిర్వహిస్తూ ఉంటారు.

ఇక ఇప్పటి వరకు రావి చెట్టు ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరు తెలుసుకున్నాము.

అయితే దేవతా వృక్షంగా భావించే వాటిలో మర్రిచెట్టు కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ మర్రిచెట్టులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకగా భావిస్తారు.మర్రిచెట్టు పుట్టుకకు మరణానికి చిహ్నంగా ఉండడంతో ఈ చెట్టును మోక్షానికి ప్రదాతగా భావిస్తారు.

అదేవిధంగా 2 మర్రి చెట్లను సక్రమంగా నాటిన వ్యక్తికి ఎంతో పుణ్యఫలం లభిస్తుందని కూడా పురాణాలు చెబుతున్నాయి.

ఈ విధంగా మర్రి చెట్లను సక్రమంగా నాటిన వారు మరణించిన తర్వాత వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.అలాగే ఎవరైతే ఈ మర్రి చెట్టుకు సంతానం లేనివారు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారో అలాంటి వారికి సంతానం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు.అందుకే మర్రి చెట్టు కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది అని చెప్పవచ్చు.

Who Plant This Tree Will Have Access To Heaven After Death Details, Plant, Worship, Hindu Belives, Heaven, Death, Banyar Tree, Hindu Tradition, Banyan Tree Pooja, Puranas, Heaven, Planting Banyan Trees - Telugu Banyar Tree, Heaven, Hindu, Banyan Trees, Puranas, Worship

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube