ఈ వృక్షం నాటిన వారికి మరణాంతరం స్వర్గలోకం ప్రాప్తిస్తుందట!
TeluguStop.com
పురాణాల ప్రకారం మన హిందువులు ఎన్నో రకాల మొక్కలను దైవ సమానంగా భావిస్తారు.
ఈ క్రమంలోనే చాలామంది వారి ఇంటి ఆవరణంలో ఈ విధమైనటువంటి మొక్కలను పెంచుతూ పూజలు చేస్తారు.
దైవ సమానంగా భావించే కొన్ని పెద్ద పెద్ద వృక్షాలకు కూడా పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారు.
అయితే ఈ విధంగా భక్తుల చేత ఉసిరి, మర్రి, రావి, అరటి వంటి వృక్షాలకు పూజలు నిర్వహిస్తూ ఉంటారు.
ఇక ఇప్పటి వరకు రావి చెట్టు ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరు తెలుసుకున్నాము.
అయితే దేవతా వృక్షంగా భావించే వాటిలో మర్రిచెట్టు కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ మర్రిచెట్టులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకగా భావిస్తారు.మర్రిచెట్టు పుట్టుకకు మరణానికి చిహ్నంగా ఉండడంతో ఈ చెట్టును మోక్షానికి ప్రదాతగా భావిస్తారు.
అదేవిధంగా 2 మర్రి చెట్లను సక్రమంగా నాటిన వ్యక్తికి ఎంతో పుణ్యఫలం లభిస్తుందని కూడా పురాణాలు చెబుతున్నాయి.
"""/" /
ఈ విధంగా మర్రి చెట్లను సక్రమంగా నాటిన వారు మరణించిన తర్వాత వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
అలాగే ఎవరైతే ఈ మర్రి చెట్టుకు సంతానం లేనివారు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారో అలాంటి వారికి సంతానం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు.
అందుకే మర్రి చెట్టు కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది అని చెప్పవచ్చు.
గేమ్ ఛేంజర్ రిజల్ట్ పై రామ్ చరణ్ రియాక్షన్ ఇదే.. గర్వపడేలా చేస్తానంటూ?