నాణ్యమైన లిక్కర్.. చౌక ధరకే.. చంద్రబాబు విచిత్ర హామి!

టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు ప్రస్తుతం వివిధ జిల్లాలలో విసృత్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.రోడ్డు షోలు,బహిరంగా సభలతో జనంతో మమేకమవుతున్నారు.  రకారకాల వాగ్దానాలు చేస్తూ జనాల్ని ఆకట్టుకునే  ప్రయత్నం చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల కోసం సన్నద్దమవుతున్న చంద్రబాబు తాజాగా  ఆస‌క్తిక‌ర‌మైన వాగ్దానాన్ని తెర‌పైకి తీసుకువచ్చారు.  టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని అందజేస్తుందని, పేరున్న బ్రాండ్‌లను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతామన్నారు.

 Nara Chandrababu Naidu Shocking Comments On Liquor Brands Details, Chandrababu N-TeluguStop.com

 కావలిలో తన రోడ్‌షో సందర్భంగా, మద్యం దుకాణాలలో ఆన్‌లైన్ చెల్లింపును అనుమతించాలని నాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

 అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని  మరచిపోయి మద్యం దుకాణాలకు వింత పేర్లతో కొన్ని లోకల్ బ్రాండ్‌లను సరఫరా చేస్తున్నరన్నారు.ఇంకా, వైసీపీ పాలనలో మద్యం షాపుల్లో నగదు మాత్రమే స్వీకరిస్తున్నారు, అయితే చెల్లింపు కోసం చేసిన నగదు నల్లధనంగా మారుతోందని ఆరోపణలు వచ్చాయి.

 AP ప్రభుత్వం మద్యం షాపుల ద్వారా అంచనా వేసిన ఆదాయాన్ని కూడా తనఖా పెట్టి 9,000 కోట్ల రూపాయల రుణాన్ని పొందినట్లు సమాచారం.

మద్యం ధరలను తగ్గిస్తామని టీడీపీ అధినేత హామీ ఇచ్చారు.  మంచి బ్రాండ్‌లతో మద్యం వినియోగదారుల ఆరోగ్యం కాపాడుతమంటూ  హామీ ఇచ్చారు.  ఈ సభలో ఛలోక్లులు కూడా విసిరారు చంద్రబాబు  మీకు ‘బూమ్ బూమ్’  మద్యం బ్రాండ్ వచ్చిందా, అని చంద్ర నాయుడు అడగ్గా ,అక్కడ ఉన్న వారందరూ నవ్వారు.

నెల్లురూ జిల్లా కందుకూరులో జరిగిన చంద్రబాబు సభలో తొక్కిసలాట కారణంగా 8 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.దీంతో చంద్రబాబు సభలకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

జనాలు ఒక దగ్గర ఎక్కువగాగుమికూడకుండా చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube