రిషబ్ శెట్టి హీరోగా దర్శకుడిగా వ్యవహరించిన తాజా చిత్రం కాంతార.ఇటీవల విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదల అయ్యి అన్ని భాషల్లో కూడా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
సినిమాలో కంటెంట్ ఉంటే భాషతో సంబంధం లేదు అన్న విషయాన్ని ఈ సినిమా ప్రూవ్ చేసింది.ఈ సినిమా అన్ని ఇండస్ట్రీలలో కూడా విడుదల అయ్యి రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతోంది.
కాగా మొదట ఈ సినిమా సెప్టెంబర్ 30న కన్నడలో విడుదల ఈ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే.ఆ తర్వాత ఈ సినిమాను తెలుగు,తమిళం, హిందీ భాషల్లోకి విడుదల చేశారు.
అన్ని భాషల్లో కూడా హిట్ టాక్ ను అందుకోవడంతో పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను రాబడుతూ దూసుకుపోతోంది కాంతార సినిమా.
ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు.
క్లైమాక్స్ లో వచ్చే వరాహ రూపం.దైవభరిష్టం అనే పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ పాటకు సంబంధించిన వివాదం ఒకటి వెలుగులోకి వచ్చింది.వరాహ రూపం పాటను తమ నవరసం పాటనుండి కాపీ చేశారు అంటూ కేరళకు చెందిన తైక్కుడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ వారు ఆరోపిస్తున్నారు.
వరాహ రూపం సాంగ్ ఇష్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.ఈ విషయంలో తైక్కుడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ వారు నెటిజెన్స్ ని మద్దతు కోరుతున్నారు.
కాంతార సినిమాకు మాకు ఎటువంటి సంబంధం లేదు.

కానీ మా నవరస సాంగ్ కి కాంతార సినిమాలో వరాహం రూపం పాటకు మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి కాబట్టి కాపీకి కారణమైన వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నాం అని తెలిపారు తైక్కుడం బ్రిడ్జ్ బ్యాండ్ వారు.అయితే ఈ సినిమా విడుదల అయ్యి ఇన్ని రోజులు అయిన తరువాత వివాదంతో వారు తెరపైకి వస్తుండడంతో అసలు వారు ఏమి ఆశించి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు అన్న విషయం పై చర్చలు మొదలయ్యాయి.ఈ విషయంపై ఇప్పటివరకు చిత్ర బృందం ఎవరూ స్పందించలేదు.
అయితే ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుండడంతో కావాలనే కొంతమంది ఈ విధంగా ఇటువంటి వివాదాలను తెరపైకి తీసుకు వస్తున్నారా.లేకపోతే దీని వెనుక ఎవరైనా ఉన్నారా అన్నా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.







