మెగా కాంపౌండ్‌కు చేరుతున్న త్రివిక్రమ్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి ‘అల వైకుంఠపురములో’ అనే పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడమే కాకుండా వసూళ్ల వర్షం కురిపించింది.

ఈ సినిమాతో బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.దీంతో త్రివిక్రమ్ మళ్లీ తనదైన మార్క్ వేసుకున్నాడు.

కాగా ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి ఇప్పటికే ప్రారంభించాడు.అయితే మెగాస్టార్ చిరంజీవితో త్రివిక్రమ్ గతంలోనే ఓ సినిమా చేయాల్సి ఉండేది.

కానీ ఆ సమయంలో చిరు రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో ఆ సినిమా ఊసే లేకుండా పోయింది.ఇక ఇప్పుడు త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు చిరు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ మేరకు త్రివిక్రమ్ చిరుకు ఓ స్టోరీలైన్ వినిపించగా, అది నచ్చడంతో తనతో సినిమా చేసేందుకు చిరు ఓకే అన్నారని తెలుస్తోంది.ఇక ఈ సినిమాను ఇప్పట్లో పట్టాలెక్కించే సూచనలు మాత్రం కనిపించడం లేదు.

కాగా చిరు ప్రస్తుతం నటిస్తున్న ఆచార్య, అటుపై లూసిఫర్ రీమేక్ చిత్రాలు పూర్తయిన తరువాతే త్రివిక్రమ్‌తో సినిమా చేసే ఛాన్స్ ఉంది.దీంతో చిరు-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే మరో ఏడాదికిపైనే వెయిట్ చేయాలని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఇక ఇదే క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కూడా త్రివిక్రమ్ ఓ ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.తారక్‌తో సినిమా తరువాత ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే ఛాన్స్ ఉందని ఫిలిం నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

మరి మెగా కాంపౌండ్‌లో త్రివిక్రమ్ ఎలాంటి సినిమాలను తెరకెక్కిస్తాడా అనే అంశం ఆసక్తిగా మారింది.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు