ఢిల్లీ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ లో ఏ టీమ్ గెలవాలన్న కూడా ఆ ఒక్కటి చేయాల్సిందే...

ఐపీఎల్ సీజన్ తో పోల్చుకుంటే ఇప్పుడు జరుగుతున్న మ్యాచులు చాలా రసవత్తరంగా సాగడమే కాకుండా ప్లేయర్లందరి మధ్య మంచి పోటీ అయితే నెలకొంటుంది.

ఇక దానితో పాటుగా ఈ సీజన్ ముగిసిన తర్వాత టి20 వరల్డ్ కప్( T20 World Cup ) ఉంది.

కాబట్టి అందులో ఏ ప్లేయర్లు సెలెక్ట్ అవుతారు అనే విషయం మీద కూడా చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి.దానికి సంబంధించిన ప్రతి మ్యాచ్ లో ప్రతి ఒక్క ప్లేయర్ అదరగొడుతున్నాడనే చెప్పాలి.

ఇక ముఖ్యంగా ఇండియన్ ప్లేయర్లు అయితే ఒక్క మ్యాచ్ లో ఒక్కొక్కరు మెరుస్తున్నారు.

కాబట్టి వీరిలో ఎవరిని టి20 వరల్డ్ కప్ లోకి తీసుకోవాలి అనే ఉద్దేశ్యం లో బిసిసిఐ( BCCI ) చాలా తీవ్రమైన కసరతులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇదిలా ఉంటే ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్( Delhi Capitals vs Gujarat Titans ) మధ్య ఒక భారీ మ్యాచ్ అయితే జరగనుంది.అయితే ఈ రెండు టీములు కూడా ఈసారి పెద్దగా ప్రభావం అయితే చూపించలేకపోతున్నాయి.

Advertisement

కాబట్టి వీళ్ల లో చాలా మంచి ప్లేయర్లు అందుబాటులో ఉన్నప్పటికీ వాళ్ళు మ్యాచ్ విన్నర్స్ గా మాత్రం నిలవలేక పోతున్నారు.కారణం ఏంటి అంటే వాళ్ళు ఆడుతున్న ఆట తీరే అని చెప్పాలి.

ఇక మ్యాచ్ సిచువేషన్ ని అంచనా వేసి దానికి అనుకూలంగా ఆడుతూ ముందుకు సాగితే విజయం అనేది వరిస్తుంది.కానీ అలా కాకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు హిట్టింగ్ చేయడం, లేదంటే ఏ టార్గెట్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆడితే అలాగే ఉంటుందని సీనియర్ ప్లేయర్లు సైతం వాళ్ళని హెచ్చరిస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే పాయింట్స్ టేబుల్ లో గుజరాత్ టీం మూడు విజయాలను నమోదు చేసుకొని ఆరో పొజిషన్ లో.కొనసాగుతుంటే ఢిల్లీ మాత్రం రెండు విజయాలను సొంతం చేసుకొని తొమ్మిదవ పొజిషన్ లో కొనసాగుతుంది.అయితే ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేదే కీలకంగా మారింది.

నిజానికి గుజరాత్ టీంలో చాలా మంచి ప్లేయర్లు ఉన్నారు వాళ్ళు ఇప్పటికీ చాలా బాగా ఆడుతున్నప్పటికీ మ్యాచ్ విన్నర్ గా మాత్రం మిగలలేకపోతున్నారు.ఇక ఢిల్లీ టీమ్ పరిస్థితి కూడా అలాగే ఉంది.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

గుజరాత్ లో శుభ్ మన్ గిల్, మిల్లర్, రషీద్ ఖాన్ లాంటి ప్లేయర్లు రాణిస్తే విజయం వరిస్తుంది.ఆ టీం ఈజీగా ఈ మ్యాచ్ ను గెలుస్తుంది.

Advertisement

అలాగే ఢిల్లీ టీంలో వార్నర్, రిషబ్ పంత్ లాంటి ప్లేయర్లు గుజరాత్ బౌలర్లను ఎదుర్కొంటు ధాటిగా ఆడితే తప్ప వాళ్ళు ఈ మ్యాచ్ లో అయితే గెలవలేరు.కాబట్టి ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టీం కి 60% గెలిచే అవకాశం ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్ కి మాత్రం 40% గెలిచే అవకాశాలు ఉన్నాయి.

తాజా వార్తలు