హిందువులు ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగల్లో శ్రీరామనవమి ఒకటి.చైత్ర మాసంలో శుక్ల పక్షంలో నవమి తిథి నాడు శ్రీరాముడు జన్మించాడు.
ఆ మహనీయుడు జన్మించిన నవమి నాడే సీతారాముల కల్యాణాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తుంది.తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
ఈ ఏడాది శ్రీరామనవమి( Rama Navami ) ఏప్రిల్ 17న వచ్చింది.అయితే శ్రీరామనవమి అనగానే అందరికీ మొదట గుర్తుకు వచ్చేది బెల్లం పానకం.
పండుగ నాడు ఆలయాల్లోనే కాకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో సైతం కచ్చితంగా బెల్లం పానకం తయారు చేసి నైవేద్యంగా పెడతారు.
బెల్లం పానకం తాగడానికి రుచికరంగానే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.పానకం తయారీలో బెల్లం, మిరియాలు, యాలకులు, వాటర్ ప్రధానంగా వాడతారు.ప్రస్తుత వేసవి కాలంలో బెల్లం పానకాన్ని నిత్యం తీసుకోవడం వల్ల అనేక లాభాలు చేకూరతాయని నిపుణులు చెబుతున్నారు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ లాభాలేంటో తెలుసుకుందాం.
ప్రస్తుత సమ్మర్ సీజన్ లో బెల్లం పానకం( Bellam Paanakam ) తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్( Dehydration ) కు గురికాకుండా ఉంటుంది.హీట్ స్ట్రోక్ నుంచి మిమ్మల్ని రక్షించడంలో బెల్లం పానకం చాలా బాగా సహాయపడుతుంది.బెల్లం పానకం శరీరంలో ఉష్ణోగ్రతలను స్థిరంగా ఉంచుతుంది.
అలాగే రక్తహీనతతో బాధపడేవారికి ఈ డ్రింక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.బెల్లంలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.
అందువల్ల బెల్లం పానకాన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే రక్తహీనత పరార్ అవుతుంది.పానకం తయారీలో వాడే మిరియాలు, యాలకులు, బెల్లం మన రోగ నిరోధక వ్యవస్థ( Immune system )ను బలోపేతం చేస్తాయి.
అనేక రోగాలకు అడ్డుకట్ట వేస్తాయి.అంతేకాదు.
బెల్లం పానకం తాగడం వల్ల శరీరంలో వ్యర్థలన్నీ బయటకు పోతాయి.బాడీ డీటాక్స్ అవుతుంది.
జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.మలబద్ధకం సమస్య ఉంటే దూరం అవుతుంది.
ఊబకాయం నుంచి బటయపడటానికి కూడా బెల్లం పానకం తోడ్పడుతుంది.