కోల్‌కతా నైట్ రైడర్స్ చేసిన ఆ ఒక్క మిస్టేక్ వల్లే రాజస్థాన్ మీద ఓడిపోయిందా..?

ఐపీఎల్ సీజన్ 17 లో భాగంగా కలకత్తా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ భారీ విక్టరీని ఛేదించి కలకత్తా పైన విజయం సాధించింది.అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కలకత్తా నైట్ రైడర్స్ లో సునీల్ నరైన్ అద్భుతమైన సెంచరీ సాధించడంతో నిర్ణీత 20 ఓవర్లకు 223 పరుగులు చేశారు.

 Did Kolkata Knight Riders Lose Against Rajasthan Because Of That One Mistake? ,-TeluguStop.com

ఇక 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ టీం కి మొదట ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ ఓపెనర్ ప్లేయర్ అయిన జోష్ బట్లర్( Jos Buttler ) సెంచరీని సాధించి చివరి వరకు పోరాడి రాజస్థాన్ టీం కి మంచి విజయాన్ని అందించాడు.

Telugu Ipl, Jos Buttler, Kolkata, Sunil Narine-Sports News క్రీడలు

ఇక ఈ మ్యాచ్ లో కలకత్తా టీం లో సునీల్ నరైన్( Sunil Narine ) 109 పరుగులు చేయగా, రాజస్థాన్ టీంలో జోష్ బట్లర్ మాత్రం 127 పరుగులు సాధించి టీం కి అద్భుతమైన విజయాన్ని అందించాడు.ఇక రాజస్థాన్ ప్లేయర్లు వచ్చినవాళ్ళు వచ్చినట్టుగా అవుట్ అయిపోయినప్పటికీ జోష్ బట్లర్ మాత్రం తనదైన రీతిలో అద్భుతమైన ఇన్నింగ్స్ ని ఆడి ఈ సీజన్ లో తన రెండోవ సంచరీ ని కూడా నమోదు చేసుకున్నాడు.ఇక మొత్తానికైతే బట్లర్ టీం కి ఎంత కీలకమైన ప్లేయరో మరొకసారి ప్రూవ్ చేసాడు.

ఇక ఒకటి రెండు మ్యాచ్ ల్లో తను సరిగ్గా ఆడకపోయిన కీలకమైన మ్యాచుల్లో మాత్రం తప్పకుండా తను అదరగొడుతూ టీమ్ కి విజయాన్ని అందిస్తూ ఉంటాడు.

Telugu Ipl, Jos Buttler, Kolkata, Sunil Narine-Sports News క్రీడలు

అందువల్లే రాజస్థాన్ టీం ప్లేయర్ల లో కీలకమైన ప్లేయర్ గా బట్లర్ ను చెప్పుకోవచ్చు…ఇక ఇది ఇలా ఉంటే కలకత్తా బౌలర్లు బట్లర్ ఆట తీరు ను సరిగ్గా అంచనా వేయలేకపోయారు.అందు వల్లే ఆయన్ని ఔట్ చేయలేకపోయారు.దాని కారణంగా కలకత్తా ఓడిపోవాల్సి వచ్చింది…ఇక ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ లో ఏడు మ్యాచ్ లు ఆడితే అందులో 6 మ్యాచ్ ల్లో విజయం సాధించి ఒక మ్యాచ్ లో ఓడిపోయింది.

ఇక ప్రస్తుతానికి రాజస్థాన్ రాయల్స్ టీం పాయింట్స్ టేబుల్ లో 12 పాయింట్లతో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube