పడుకునే సమయంలో ఏ వైపు తిరిగి పడుకుంటే మంచి జరుగుతుంది?

నిద్ర అనేది ప్రతి మనిషికి ఎంతో అవసరం.అయితే మనం పడుకునేటప్పుడు ఎటువైపు తల పెట్టాలి, ఎటువైపు కాళ్లు ఉండాలన్న విషయం కొందరికి తెలియకపోవచ్చు.

ఏ వైపు తల పెట్టుకుని ఉంటే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఇక్కడ చదివి తెలుసుకుందాం.సాధారణంగా చాలామంది పడమర దిక్కున తలపెట్టి పడుకుంటారు.

ఎప్పుడూ కూడా పడమర వైపు లేదా ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదు.ఉత్తరం వైపు తల పెట్టి పడుకోవడం వల్ల మృత్యువు సంభవిస్తుందని అర్థం.

పడమర వైపు తల పెట్టి పడుకోవడం వల్ల కాళ్లు తూర్పు వైపు ఉంటాయి.అంటే మన కాళ్లు సూర్యునికి చూపిస్తున్నటువంటి దోషం కలుగుతుంది.

Advertisement

అందుకే పడమర వైపు తల పెట్టి పడుకోకూడదు.పడమర వైపు తల పెట్టి పడుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.

ఉత్తరం దిక్కున తల పెట్టుకోవడం వల్ల పాదాలు దక్షిణ వైపు ఉంటాయి.ఉదయం కళ్ళు తెరవగానే దక్షిణమైనటువంటి యమ స్థానం కనిపిస్తుంది.

యమ స్థానం చూడడం మృత్యు ప్రదము.తూర్పు లేదా దక్షిణం వైపు తల పెట్టుకొని పడుకోవడం వల్ల.

ఎలాంటి సమస్యలు తలెత్తవని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.తూర్పు వైపు తల పెట్టి పడు కోవడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

అందుకే విద్యార్థులకు ఈ దిశ అనుకూలం.అన్నిటికంటే దక్షిణ దిశ నిద్రకు అనుకూలమైనది.

Advertisement

ఆ దిశ ఆరోగ్యానికి, నిద్ర నాణ్యతకు ఈ దిశ అనుకూలిస్తుంది.మనం నిద్ర లేచిన తర్వాత మొదటగా చేయాల్సిన పని మన రెండు అరచేతులను గట్టిగా రాపిడి చేసి వేడి పుట్టిన తర్వాత రెండు అర చేతులను కళ్లపై ఉంచాలి.

ఇలా చేయడం ద్వారా చేతి వేళ్లలో ఉండే రక్తనాళాలు చురుగ్గా పనిచేస్తాయి.దీంతో శరీర వ్యవస్థ సాధారణంగా మారుతుంది.

చూశారు కదా ఏ దిక్కున తల పెట్టి పడుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఎట్టి పరిస్థితిలో కూడా తలను పడమర వైపు ఉత్తరం వైపు పెట్టి పడుకోకూడదు.వీలైనంత వరకు దక్షిణ ముఖంగా తల పెట్టి పడుకోవాలి లేదా తూర్పు వైపు తలా పెట్టి పడుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

తాజా వార్తలు