మొహం చాటేసిన బాలయ్య... సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డాడు

నందమూరి తారక రామారావు బయోపిక్‌ ఎన్టీఆర్‌ రెండు పార్ట్‌లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.వంద కోట్ల బిజినెస్‌ చేసిన ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ చిత్రం కనీసం పాతిక కోట్లు కూడా వసూళ్లు రాబట్టలేక పోయింది.

 Where The Ntr Biopic Distributors Compensated For The Losses-TeluguStop.com

దాంతో డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగారు.వారికి సాయం చేస్తానంటూ ప్రకటించిన బాలయ్య ఆ తర్వాత కనిపించలేదు.

ఎన్టీఆర్‌ మహానాయకుడు విడుదల సమయంలో డిస్ట్రిబ్యూటర్ల నుండి సమస్య ఎదురు రావద్దనే ఉద్దేశ్యంతో నష్టాలను భరిస్తాను అంటూ చెప్పిన బాలయ్య ఆ తర్వాత కనిపించడం లేదు.

మహానాయకుడు సినిమాకు ఏమైనా లాభం వస్తే ఆ డబ్బులను ఆయన ఇవ్వాలని భావించాడు.

కాని పాపం మహానాయకుడు మరీ అయిదు కోట్ల రూపాయలే రాబట్టింది.కనీసం పాతిక కోట్లు అయినా రాబడితే ఆ మొత్తంను వారికి ఇచ్చేవాడు.

కాని అత్యంత దారుణమైన ఫలితాన్ని మహానాయకుడు చవిచూడటంతో ఏం చేయలో పాలుపోకుండా ఉంది.ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర అనగానే అంతా కూడా ఎంతో ఆసక్తిని కనబర్చారు.

కాని తీరా సినిమా విడుదల సమయానికి ఆ ఆసక్తి అంతా కనిపించకుండా పోయింది.

మహానాయకుడు సినిమా ఆకట్టుకునే విధంగా ఉన్నా కూడా బాలకృష్ణకు తీవ్ర నష్టాలను, నిరాశను మిగిల్చాయి.ఇలాంటి సమయంలో డిస్ట్రిబ్యూటర్లకు బాలయ్య మొహం చూపించలేక పోతున్నాడట.వారికి కనిపించకుండా, సమాధానం చెప్పలేకుండా తిరుగుతున్నాడట.

డిస్ట్రిబ్యూటర్లు తమకు ఇచ్చిన మాట నిలుపుకుని తమకు న్యాయం చేయాలని బాలయ్య ఆఫీస్‌ చుట్టు, ఇంటి చుట్టు తిరుగుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.బాలయ్య తదుపరి చిత్రం విషయంలో ఈ ఎఫెక్ట్‌ పడే అవకాశం ఉందని అనిపిస్తుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube