మడి కట్టుకోవడం అంటే ఏమిటి.. మడి ఆచారం ఏం చెబుతోంది?

మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో ఆచార వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.చాలామంది ఈ ఆచారాలను క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటారు.

మరి ఇలాంటి ఆచార వ్యవహారాలలో ఎంతో సాంప్రదాయబద్దమైనదే మడికట్టు ఆచారం.పూర్వ కాలం నుంచి ప్రస్తుత కాలంలో కొందరు ఇప్పటికీ మడికట్టు ఆచారాన్ని పాటిస్తున్నారు.

అయితే ఈ మడికట్టు వల్ల కేవలం ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.మరి మడి కట్టుకోవడం అంటే ఏమిటి? ఈ మడికట్టు ఆచారం మనకు ఏం చెబుతుంది అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.మన హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాచుర్యంలో ఉన్న ఆచారాలలో మడి ఆచారం ఒకటి.

మడి ఆచారం అంటే మన శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం అని అర్థం.ఈ మడి ఆచారాన్ని పాటించడం వల్ల శారీరక, మానసిక ప్రశాంతత కలుగుతుంది.

Advertisement
What Is The Mandible And What Does The Madi Ritual, Mandible,madi Ritual, Medic

ఎంతో ప్రశాంతతను కలిగించే ఈ మడిని ఎలా కట్టుకోవాలి అనే విషయానికి వస్తే.రేపు ఉదయం మడి కట్టుకోవాలని భావించేవారు ఈరోజు ఉదయమే రేపు కట్టుకోబోయే చీరను శుభ్రమైన నీటితో ఉతికి ఆ చీరను ఎవరు తాకకుండా జాగ్రత్తగా ఆరవేయాలి.

ఈ విధంగా మడి కట్టుకోవడానికి ఉపయోగించే దుస్తులను తాకకుండా ఉండడం కోసం ఎవరికీ అందనంత ఎత్తులో ఇంటిలో దుస్తులను ఆరేసు కునేవారు.

What Is The Mandible And What Does The Madi Ritual, Mandible,madi Ritual, Medic

ఈ విధంగా మరుసటి రోజు ఉదయం స్నానం చేసి తడి బట్టలతో వచ్చి ముందు రోజు ఆరేసిన ఆ బట్టలతో గోచి పోసుకొని మడి కట్టుకోవాలి.ఈ విధంగా మడి కట్టుకున్న తర్వాత ఎలాంటి మైల వస్తువులను తాక కూడదు.ఒకవేళ తాకినా మళ్ళీ స్నానం చేసి మరోసారి మడి కట్టు కోవాల్సి వస్తుంది.

ఈ విధంగా మడి కట్టుకొని పూజ చేయటం,వంట చేయడం వంటివి పూర్వకాలంలో పెద్దలు ఎంతో నిష్టగా పాటించేవారు.ఈ విధంగా మడి కట్టుకొని వంట పూజ చేసిన తర్వాత ఆ మడితోనే భోజనం చేసిన తరువాత మడికట్టును వదిలి ఇతర వ్యవహారాలను చూసుకునే వారు.

What Is The Mandible And What Does The Madi Ritual, Mandible,madi Ritual, Medic
శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

అయితే చనిపోయిన వారికి చేసే కర్మకాండలు తడిబట్టలతో చేయాలి.అదేవిధంగా పూజలు తడిపి ఆరవేసిన బట్టలతో మాత్రమే చేయాలి.ఈ విధంగా శరీర పరిశుభ్రతను పాటిస్తూ చేయటం వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా ఉండటమే కాకుండా ఎలాంటి సూక్ష్మక్రిములు చేరకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండటం కోసమే పూర్వకాలంలో మన పెద్దవారు ఈ మడికట్టు సాంప్రదాయాన్ని పాటించే వారు.

Advertisement

తాజా వార్తలు