చలిచీమలపాలెం రోడ్దు సంగతేంది సారూ...?

నల్లగొండ జిల్లా:తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) గ్రామీణ ప్రాంతాల రహదారులను పూర్తిగా విస్మరించిందని ఏ గ్రామం రోడ్డు చూసినా ఇట్టే అర్థమవుతుంది.

నల్లగొండ జిల్లా( Nalgonda District ) వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం నుండి చలిచీమలపాలెం( Chali Chimala Palem ) వెళ్లే రోడ్డు గుంతలమయం కావడంతో ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు.

గ్రామ సర్పంచ్,ప్రజా ప్రతినిధుల, అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, వర్షాకాలంలో ఆటోలు, ద్విచక్ర వాహనాలు దిగబడి ఇబ్బందులు పడుతున్నామని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధ్వాన్నంగా తయారైన లక్ష్మీదేవిగూడెం నుండి చలిచీమలపాలెం రోడ్డును కాంగ్రెస్ పార్టీ నేతలు పరిశీలించారు.

What About Chalichimalapalem Road Sir...?-చలిచీమలపాలెం �

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోడ్డుపైఎలా ప్రయాణం చేయాలని ప్రశ్నించారు.రోడ్డు మొత్తంగుంతలుపడి వర్షం వస్తే చెరువును తలపించేలా ఉందని,కనీసం నడిచే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.

స్థానిక సర్పంచ్ ఇప్పటికైనా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి కనీసం మరమ్మతులు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.

Advertisement
కులం పేరుతో దూషించిన ముగ్గురికి ఆరు నెలలు జైలు శిక్ష

Latest Nalgonda News