సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ వారికేనా: అంజి యాదవ్

సూర్యాపేట జిల్లా: కోదాడ నియోజకవర్గంలో ఉన్న బీసీలకు బీసీ బందు పథకం ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులకే ఇస్తున్నారని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజి యాదవ్ మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వ అందించిన బీసీ బంధు పథకాలు ప్రతి ఒక్క నీరు పేద బీసీలకు అందాలని,కోదాడలో దానికి విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇస్తున్నారని, నిజమైన నిరుపేద కుటుంబానికి ఎందుకు ఇవ్వడం లేదని,రాష్ట్ర పథకాలు బీఆర్ఎస్ పథకాలుగా మారాయని ఎద్దేవా చేశారు.

గుడిబండ లో దళిత బంధువు పథకాలలో దళితులకు మోసాలు చేశారని, దళితులు నాకు ఆశ్రయించారని తెలిపారు.వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

బీసీ బంధు పథకం కూడా ప్రతి ఒక్క నిరుపేద బీసీలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

ఆత్మకూర్(ఎస్) మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
Advertisement

Latest Suryapet News