కులమత రాజకీయాలకతీతంగా సంక్షేమం: పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: కులమత రాజకీయాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని ప్రజా పాలన సభలు నిర్వహిస్తున్నామని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.

శనివారం సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలోని ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని ప్రజల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రజలకు ఆరు గ్యారంటీలు అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్, అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Latest Suryapet News