30 యేళ్ళుగా మాలలపై జరుగుతున్న దాడిని అడ్డుకుంటాం

సూర్యాపేట జిల్లా(Suryapet District):గత 30 యేళ్ళుగా మాలలపై జరుగుతున్న దాడులు, మాటల తూటాలను అడ్డుకుంటామని, డిసెంబర్ 1న హైద్రాబాద్ (hyderabad)లోని జింఖానా గ్రౌండ్లో 20 లక్షల మంది మాలలతో సింహగర్జన నిర్వహిస్తున్నామని,ఈ సింహగర్జనతో రాష్ట్రంలో మాలల సత్తా ఏమిటో చూపెడుతామని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కో-చైర్మన్, సూర్యాపేట జిల్లా ఇంచార్జి మేక వెంకన్న అన్నారు.

శనివారం జిల్లా కేంద్రంలోని రైతుబజార్ అంబేద్కర్ విగ్రహం(Rythu Bazar ,Ambedkar statue) వద్ద డిసెంబర్ 1న జరిగే సింహర్జన కరపత్రాలను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మాల సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి మాలల రక్షణకు,వారి హక్కుల సాధనకు ఈ సింహగర్జనతో హైద్రాబాద్ ను దిగ్బందనం చేస్తామన్నారు.

ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి చైర్మన్ చెన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సభకు మాల ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ వెంకటస్వామి,నాగరాజు, మేడి సత్యంతో పాటు ఇతర మాల ప్రజా ప్రతినిదులు హాజరవుతారన్నారు.సూర్యాపేట జిల్లా నుంచి 20 బస్సుల్లో ప్రతి మాల కులస్తుడు సింహగర్జనకు వచ్చేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.

We Will Stop The Attack On Malls For 30 Years, Suryapet District, Hyderabad, Ryt

డిసెంబర్ 1న హైద్రాబాద్లో జరిగే మాల సింహగర్జన సభకు మాలలు స్వచ్చందంగా తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి రాష్ట్ర కో-చైర్మన్ తాళ్ళపల్లి రవి,సోషల్ మీడియా కన్వీనర్ నాగటి జోసఫ్, జిల్లా కన్వీనర్ చందాదాస్, మద్దూరి కుమార్,మహిళా కో-కన్వీనర్ గాజుల రాంబాయమ్మ,వలమల్ల ప్రకాష్,నాయకులు అనుములపురి రామకృష్ణ,బొల్లెద్దు మహేందర్,అనుములపురి బోస్,కూరపాటి విజయ్,చింతమల్ల జ్యోతి,చెవుల రమణ, గండమల్ల విజయ్ కుమార్,కట్ల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News