అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తాం - జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు, రేషన్ కార్డులు అర్హులందరికీ  అందిస్తామని, దరఖాస్తులు సమర్పణ కు చివరి తేదీ ఏమీ లేదు, అపోహలు, తప్పుడు వార్తలు నమ్మవద్దు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు.

ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు, రేషన్ కార్డుల జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో గ్రామ, వార్డ్ సభలకు ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు శ్రీకారం చుట్టగా, బుధవారం ఎల్లారెడ్డి పేట మండలం పదిర ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు.

కార్యక్రమానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు.అనంతరం కలెక్టర్ మాట్లాడారు.

We Will Provide Government Schemes To All The Deserving District Collector Sande

ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు.అర్హులందరికీ ఆయా పథకాలు అమలు చేస్తామని,గ్రామ సభలలో పెట్టే ప్రాథమిక జాబితా మంజూరు పత్రం కాదు, కేవలం దరఖాస్తుల స్వీకరణ జాబితా మాత్రమేనని స్పష్టం చేశారు.

ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకొని వారు అర్జీలు సమర్పించాలని సూచించారు.కార్యక్రమంలో తహసిల్దార్ రామచంద్రం, ఎంపీఓ రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
అఖండ2 డిజిటల్ హక్కుల కోసం ఊహించని స్థాయిలో పోటీ.. ఆ రేంజ్ లో అమ్ముడయ్యాయా?

Latest Rajanna Sircilla News