రాజన్న సిరిసిల్ల జిల్లా :ఒరిస్సా రాష్ట్రం నుండి వలస వచ్చిన ఇటుక బట్టీ కూలీల పిల్లలు 17 మందితల్లి దండ్రుల తో పని చేస్తూ బాల కార్మికులు గా మార నున్న పిల్లల వద్దకే ప్రభుత్వ పాఠశాల తరలి వెళ్ళింది.వారందరికీ చదువుకొనే అవకాశం లభించింది.
చదువు రాకుండా అక్షర జ్ఞానం లేకుండా భవిష్యత్తు అంధకారం కాకూడదనే ఆలోచనతో ఎల్లారెడ్డి పేట మండలంలోని గొల్లపల్లి సమీపంలో ఇటుక బట్టీల లో కూలీ చేస్తూ జీవిస్తున్న వలస కార్మికుల పిల్లలకు చదువు నేర్పించాలని నిర్ణయించారు మండల విద్యాధికారి గాలి పెళ్లి కృష్ణ హరి.
రాచర్ల గొల్లపల్లి పరిసర ప్రాంతంలో ఏ ఎన్ బి ఇటుక బట్టి ఏర్పాటు చేయగా అక్కడ ఒరిస్సా కార్మిక పిల్లలకు అందుబాటులో పాఠశాల లేక పోవడంతో చదువుకొనే అవకాశం లేక చిన్న పిల్లలు తల్లి దండ్రులకు ఇటుక బట్టీ పనులలో సహాయ పడుతూ బాల కార్మికులుగా వుంటున్న పరిస్థితి నీ ఎం ఈ వో కృష్ణహరీ గుర్తించారు.
వారందరికీ వున్న చోటనే ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలని భావించి జిల్లా విద్యాధి కారి, ఉన్నత అధికారుల అనుమతితో వలస కార్మికుల పిల్లలు వున్న చోటనే ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించారు ఎం ఈ ఓ కృష్ణ హరి.ప్రతి సంవత్సరం ఒరిస్సా నుంచి ఇటుక బట్టీలలో పనిచేయుటకు కార్మికులు వస్తుండటం,వారి పిల్లలకు విద్యా సౌకర్యాలు లేక వారి బంగారు భవిష్యత్తు చదువుకు దూరం అవుతుంది.
వలస కార్మికుల పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇటుక బట్టీల యజమాన్యాన్ని ఎం ఈ ఓ ఒప్పించి వారు పని చేస్తున్న చోటనే ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేసి ప్రారంభించారు.అక్కడున్న 17 మంది ఒరిస్సా వలస కార్మికుల విద్యార్థులకు విద్యాబోధన చేయుటకు మండల విద్యాధిారి కారి చర్యలు చేపట్టారు.
వలస కార్మికుల పిల్లల వద్దకే తరలి వెళ్ళిన ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు కార్యక్రమంలో బొప్పాపూర్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు మధుమాలతి విద్యార్థులకు అవసరమయిన పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు, పెన్సిల్స్ వితరణ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి మనిషికి కూడు, గుడ్డ, గూడు ఎంత ముఖ్యమో విద్య కూడా అంతే ముఖ్యము అని అన్నారు.
మనిషికి మూడో నేత్రం విజ్ఞాన నేత్రం అని బావించా లని ఏ ఒక్క చిన్నారిచదువుకు దూరం కాకూడదని తెలిపారు.
అందుకే వలస కార్మికుల పిల్లలకు వారు పని చేస్తున్న చోటనే ప్రభుత్వ పాఠశాలను నెలకొల్పుటకు కృషి చేశాం అని, వారికి విద్యాబుద్ధులు, శుచి శుభ్రత ను,క్రమశిక్షణను నేర్పడం జరుగుతుందని తెలిపారు.
ఈ విద్య సంవత్సరం మే నెల 28 వరకు పిల్లలకు విద్యా బోధన చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ కృష్ణ హరీ,జడ్పీ ఎస్ ఎస్ ఎస్ ప్రధానోపాధ్యాయులు మధు మాలతి తో పాటుసిఆర్పి లు లావణ్య, చంద్రయ్య, ఉపేందర్ గౌడ్ , ఇటిక బట్టిలా యజమాన్యం రాజశేఖర్ ,బాబు ,విద్యా వాలంటరీ లక్ష్మి ,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.







