మేమెంతో మాకంత ఇవ్వాలి:వంగపల్లి శ్రీనివాస్

సూర్యాపేట జిల్లా:సీఎం కేసీఆర్ ( CM KCR )ప్రతి దళితునికి దళిత బంధు అందజేయాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్( Vangapalli Srinivas ) మాదిగ డిమాండ్ చేశారు.

బుధవారం జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షుడు పడిదల రవికుమార్ మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా 13 అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాలకు మాదిగలకు కేటాయించాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఇంటి స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి మూడు లక్షలు కేటాయించడం సరికాదని,10 లక్షలు పెంచాలని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటానని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఆ తర్వాత విస్మరించిందన్నారు.

ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత చేయాలని లేని పక్షంలో గ్రామాల్లో తిరగనియ్యమని హెచ్చరించారు.రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు ( Dalit Bandhu )పథకంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, వెంటనే సీఎం కేసీఆర్ దళిత బంధు అక్రమాల కారకులను శిక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈనెల 30న హైదరాబాదులోని ఇందిరా పార్క్ లో జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ పల్లెటి లక్ష్మణ్ మాదిగ,పాల్వాయి పరశురాం మాదిగ,బొజ్జ పరశురాం మాదిగ,కనుక జానయ్య మాదిగ,ఏర్పుల సాయి మాదిగ,ఠాగూర్ మాదిగ పాల్గొన్నారు.

Advertisement
జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్...!

Latest Suryapet News