తెలంగాణలో కులగణన పారదర్శకంగా చేశాం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండ జిల్లా: ఇప్పటికే 55 రోజుల పాటు సమగ్ర కుటుంబ సర్వే చేశామని,ఇప్పుడు మరో 10 రోజుల పాటు అవకాశం కల్పిస్తున్నామని అందరూ సహరించి సర్వే పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

ఆదివారం నల్లగొండలో కుల గణనపై బీజేపీ నాయకుల మాటలపై స్పందిస్తూ మేము సర్వే పారదర్శకంగా పూర్తి చేశాం, అయినా ఎన్నికలు వాయిదా వేసి మళ్ళీ అవకాశం ఇచ్చాం,సర్వే పూర్తి అయిన తర్వాత పార్లమెంటులో చట్టం చేయాలని తీర్మానం పంపిస్తాం,రాష్ట్రానికి చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకురావాలి,చట్టం అయ్యేలా చూడాలని సూచించారు.

Latest Nalgonda News